Axar Patel: ఒకవైపు ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సంతోషంలో ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు అక్షర్ పటేల్ చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2025 ముగింపు తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వైరల్ వీడియోలో అక్షర్ పటేల్ తన క్రికెట్ ప్రయాణం ఇక్కడితో ముగిసిందని చెబుతూ కనిపిస్తున్నాడు.
ఈ వీడియోలో అక్షర్ పటేల్ రిటైర్మెంట్ స్పీచ్ ఇస్తూ ఇలా అన్నాడు. చాలా ముఖ్యమైన ప్రకటన. నాకు ఈ ప్రకటన చేయడం సులభం కాదు. క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది, నా గుర్తింపు, మీ ప్రేమ, కానీ ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుంది. బహుశా నా క్రికెట్ ప్రయాణం ఇక్కడితో ముగిసింది అనుకుంటా అని అక్షర్ చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
Also Read: Rishi Sunak: ఆర్సీబీకి బ్రిటన్ మాజీ ప్రధాని సపోర్ట్.. సోషల్ మీడియాలో ఓ రియాక్షన్ వీడియో వైరల్!
వాస్తవం ఏంటంటే?
అక్షర్ పటేల్ భారతదేశంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్ ఆటగాళ్లలో ఒకడు. ఈ వీడియోను మేము ఫ్యాక్ట్ చెక్ (హ్యాష్ ట్యాగ్) చేసినప్పుడు అది ఏఐ ద్వారా తయారు చేయబడిన వీడియో అని తేలింది. అక్షర్ పటేల్ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఎలాంటి పోస్ట్‌ను షేర్ చేయలేదు. బీసీసీఐ కూడా ఇలాంటి విషయాన్ని ధృవీకరించలేదు. ఐపీఎల్ 2025లో అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ జట్టు పాయింట్ల టేబుల్‌లో ఐదవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పటేల్ ప్రస్తుతం భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.
గత నెలలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన విషయం క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు గత సంవత్సరం టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు. విరాట్-రోహిత్ టీ20 రిటైర్మెంట్ తర్వాత.. అక్షర్ పటేల్ టీ20 జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.