Site icon HashtagU Telugu

Axar Patel Wedding: పెళ్లి పీటలెక్కనున్న మరో టీమిండియా క్రికెటర్

patel

Resizeimagesize (1280 X 720) (4) 11zon

టీమిండియాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు త్వరలో పెళ్లికొడుకులుగా కనిపించబోతున్నారు. కేఎల్ రాహుల్ పెళ్లి గురించి గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో పెళ్లి చేసుకోనున్న టీమిండియా మరో ప్లేయర్. త్వరలో తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్న భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Wedding) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమైనట్లు సమాచారం. కాగా గతేడాది జనవరి 20న అక్షర్ పుట్టినరోజు సందర్భంగా వీరి నిశ్చితార్థం జరిగింది.

అక్షర్ పటేల్ తన ప్రియురాలైన మేహా పటేల్‌ను ఈ నెలలో పెళ్లాడనున్నాడు. ఈ కారణంగానే న్యూజిలాండ్‌తో జరిగే దేశవాళీ వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి అతనికి బీసీసీఐ సెలవు ఇచ్చింది. జట్టును ప్రకటించినప్పుడు కుటుంబ కారణాల వల్ల అక్షర్ సిరీస్‌కు అందుబాటులో లేడని బోర్డు తెలిపింది. అక్షర్ చాలా కాలంగా మేహాతో డేటింగ్ చేస్తున్నాడు. గతేడాది తన పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా మేహాను చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే అభిమానులకు పంచుతూ ఫొటోలను పంచుకున్నాడు.

Also Read: Sankranti: సంక్రాంతి విశిష్టత, సంప్రదాయాల వెనుక రహస్యాలు

అక్షర్ పటేల్ కాబోయే భార్య మేహా వృత్తి రీత్యా డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. అక్షర డైట్ విషయంలోనూ ఆమె జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతే కాకుండా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అక్షర్‌తో చాలా చిత్రాలు ఉన్నాయి. ఆమె చేతిపై ‘AKSH’ అని రాసి ఉన్న పచ్చబొట్టును బట్టి మేహా ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ అక్షరాలు పటేల్ పేరు ప్రారంభ అక్షరాలు.

Exit mobile version