Mitchell Marsh : ఇది ఆస్ట్రేలియా క్రికెటర్ల అహకారం..వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి.. మందు తాగుతున్నారు

ఎవరైనా సరే వరల్డ్ కప్ ట్రోఫీ గెలిస్తే దానిని నెత్తిన పెట్టుకుంటారు. ముద్దాడతారు. ఆ ట్రోఫీని చూసుకొని మురిసిపోతారు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ మాత్రం ఇలా ఆ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకొని అవమానపరిచాడు

  • Written By:
  • Publish Date - November 20, 2023 / 12:26 PM IST

ఆరోవసారి వరల్డ్ కప్ (World Cup) గెలిచినా..ఆస్ట్రేలియా (Australia ) క్రికెటర్లు..వారి అహకారాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు..గతంలో పలుసార్లు కప్ గెలిచామని పొగరుతో పలు రకాలుగా అవమానించారు. 2008లో ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ తో ఆస్ట్రేలియా అమర్యాదగా ప్రవర్తించడం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక ఇఉపుడు మరోసారి అలాగే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మరోసారి విజయం సాధించి కప్ ను దక్కించుకుంది. విజయం సాధించిన తర్వాత.. ఆస్ట్రేలియా క్రికెటర్లు వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటోలు దిగారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మిచెల్ మార్ష్ (Mitchell Marsh)వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి.. బీరు తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీంతో అపురూపంగా చూసుకోవాల్సిన వరల్డ్ కప్ ను ఇలా కాళ్ళ కింద పెట్టి ఏకంగా ఆస్ట్రేలియా జట్టు అవమానించింది అంటూ ఎంతో క్రికెట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎవరైనా సరే వరల్డ్ కప్ ట్రోఫీ గెలిస్తే దానిని నెత్తిన పెట్టుకుంటారు. ముద్దాడతారు. ఆ ట్రోఫీని చూసుకొని మురిసిపోతారు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ మాత్రం ఇలా ఆ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకొని అవమానపరిచాడు. ఆరుసార్లు వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన అహంకారం కళ్లు నెత్తికెక్కేలా చేశాయంటూ అభిమానులు మార్ష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పటి ఫోటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కప్ కు ఎంత గౌరవిస్తున్నారో చూసి నేర్చుకొండని చెప్తున్నారు. అసలు మీరు వరల్డ్ కప్ ఆడటానికి కూడా అనర్హులని… ఐసీసీ క్రికెట్ ఆస్ట్రేలియాపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : Shiva Abhishekam: శివుడికి అభిషేకం చేస్తే కలిగే శుభాలివే..