Site icon HashtagU Telugu

Ravindra Jadeja: విషం కక్కిన ఆస్ట్రేలియా మీడియా.. నిన్న కోహ్లీ, ఇప్పుడు జడేజా!

Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja: విరాట్ కోహ్లీ మెల్‌బోర్న్ చేరుకున్నప్పుడు ఆస్ట్రేలియా మీడియాతో వాగ్వాదం జరిగింది. విరాట్ తన ఫామిలీ ఫోటోలు తీయడానికి నిరాకరించాడు. దీనిపై ఆస్ట్రేలియా మీడియా రచ్చ చేసింది. తన ప్రైవసీకి భంగం కలిగంచవద్దని కోహ్లీ కోరగా అక్కడి మీడియా రూల్స్ మాట్లాడటం కోహ్లీకి నచ్చలేదు. దీంతో ఆ జర్నలిస్టులకి కోహ్లీ లైఫ్ అండ్ రైట్ ఇచ్చేశాడు. అయితే ఇది జరిగిన కొన్ని గంటలకే రవీంద్ర జడేజా (Ravindra Jadeja) విషయంలో మరో ఘటన జరిగింది.

రవీంద్ర జడేజా ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత ఎంసీజీ గ్రౌండ్‌కు వచ్చాడు. అక్కడ మీడియా సమావేశానికి ఇండియన్ మీడియాతో పాటు ఆస్ట్రేలియన్ మీడియా వాళ్ళు కూడా హాజరయ్యారు. అయితే ఇండియన్ మీడియా అడిగిన ప్రశ్నలకు జడేజా తన మాతృభాషలో సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ మీడియా జడేజాను ఇంగ్లీష్‌లో వరుస ప్రశ్నలు అడిగింది. ఈ విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ రిపోర్టర్ టీమ్ ఇండియా మీడియా మేనేజర్‌తో మాట్లాడి ఇంగ్లీష్ లో తమ తరుపున ఒక ప్రశ్న అడగమని అడిగాడు. అయితే మీడియా మేనేజర్ టైం లేకపోవడంతో సమావేశాన్ని ముగించేశాడు. దీనిపై ఆస్ట్రేలియా మీడియా మండిపడింది. రవీంద్ర జడేజా ఇంగ్లీష్‌లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడని ఆరోపించింది. దీంతో మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇండియన్ మీడియా కోసమే ఏర్పాటు చేశారని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా జర్నలిస్టులు తమకు తోచిన విధంగా రాసేస్తున్నారు.

Also Read: Kohli Crying: గదిలో ఏడుస్తూ కూర్చున్న కోహ్లీ.. సీక్రెట్ రీవీల్ చేసిన అనుష్క

టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్ మహ్మద్ సిరాజ్ మధ్య వివాదం జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా మీడియా సిరాజ్‌ను విలన్‌గా ప్రదర్శించింది. ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు కూడా సిరాజ్‌ని అడిలైడ్‌లో ఆపై గబ్బాలో ట్రోల్స్ చేశారు. అయితే ఈ వివాదం బ్రిస్బేన్ నుండి మెల్బోర్న్‌కు కూడా చేరుకుంది.