WTC Final 2023: భారత్ బౌలర్ల ధాటికి కంగారు పడుతున్న కంగార్లు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాలు చివరి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

WTC Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాలు చివరి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో భారత ఫాస్ట్ బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేస్తున్నారు. షమీ, సిరాజ్‌లు కంగారూ బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

సిరాజ్ పేస్ ముందు ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుషాగ్నే కూడా తడబడ్డాడు. సిరాజ్ వేసిన ఓ బంతి మార్నస్ చేతికి బలంగా తాకింది. దీంతో మార్నస్ విలవిలలాడాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఖాతా తెరవకుండానే ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. దీని తర్వాత టెస్ట్ క్రికెట్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుషాగ్నే క్రీజులోకి వచ్చాడు. అయితే షమీ మరియు సిరాజ్ ధాటిగా బౌలింగ్ చేయడంతో లాబుషాగ్నే అసౌకర్యంగా కనిపించాడు. ఎనిమిదో ఓవర్ తొలి బంతికే సిరాజ్‌ పేస్‌తో మార్నస్‌ లాబుషాగ్నే గాయపడ్డాడు. 143 వేగంతో వచ్చిన బంతి నేరుగా లాబుషాగ్నే బొటన వేలికి తగలడంతో లాబుషాగ్నే అల్లాడిపోయాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో మైదానంలో ఫిజియో సహాయం తీసుకున్నాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ 60 బంతుల్లో 43 పరుగులు చేసి 8 బౌండరీలు బాదాడు. మార్నస్ 62 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మార్నస్ 3 బౌండరీలతో సరిపెట్టుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ కంటే రవీంద్ర జడేజాపైనే కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువ నమ్మకం ఉంచాడు. దీంతో పాటు వికెట్‌కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ కంటే కేఎస్‌ భరత్‌కు ప్రాధాన్యతనిచ్చారు. ఇక ఆల్ రౌండర్ గా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం లభించింది. మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో భారత జట్టు మైదానంలోకి దిగింది.

Read More: Jagan Cabinet 3.0 : `ముంద‌స్తు` లేదు! మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న‌ మూడోసారి షురూ?