T20 World Cup: శభాష్ స్కాట్లాండ్ ఆసీస్ ,ఇంగ్లాండ్ లను టెన్షన్ పెట్టిన టీమ్

టీ ట్వంటీ ప్రపంచకప్ లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. టాప్ టీమ్ ఆస్ట్రేలియాకు స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. అదే సమయంలో ఇంగ్లాండ్ ను కూడా టెన్షన్ పెట్టింది. ఎందుకంటే ఆసీస్ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టేది.

T20 World Cup: టీ ట్వంటీ ప్రపంచకప్ లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. టాప్ టీమ్ ఆస్ట్రేలియాకు స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. అదే సమయంలో ఇంగ్లాండ్ ను కూడా టెన్షన్ పెట్టింది. ఎందుకంటే ఆసీస్ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టేది. అందుకే ఆసీస్ కు సపోర్ట్ ఇచ్చిన ఇంగ్లాండ్ సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకుంది. నిజానికి స్కాట్లాండ్ , ఆస్ట్రేలియా మ్యాచ్ వన్ సైడ్ గా జరుగుతుందనుకుంటే చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ చివరి వరకూ అద్భుతంగా పోరాడింది.

మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్రెండన్ మెక్‌కల్లమ్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60 హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ఇ 42 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లపై వీరిద్దరూ ఎటాకింగ్ బ్యాటింగ్ తో జట్టుకు మంచి స్కోర్ అందించారు.ఛేజింగ్ లో ఆసీస్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. వార్నర్ , మిఛెల్ మార్ష్ సింగిల్ డిజిట్ కే ఔటవగా… మాక్స్ వెల్ కూడా నిరాశ పరిచాడు. దీంతో స్కాట్లాండ్ సంచలనం సృష్టించేలా కనిపించింది. ఈ దశలో ట్రావిస్ హెడ్ , స్టోయినిస్ కీలక హాఫ్ సెంచరీలతో ఆసీస్ ను ఆదుకున్నారు. చివర్లో టిమ్ డేవిడ్ కూడా చెలరేగడంతో ఆసీస్ చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. ఓడినప్పటకీ స్కాట్లాండ్ పోరాటపటిమ ఆకట్టుకుంది.

ఆసీస్ ఈ మ్యాచ్ కు ముందే సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకోగా… ఐదేసి పాయింట్లతో ఇంగ్లాండ్ , స్కాట్లాండ్ సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ సూపర్ 8కు చేరింది.

Also Read: Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ? : రాహుల్‌గాంధీ