Site icon HashtagU Telugu

Australia big Win: ఐర్లాండ్‌పై ఆసీస్ విజయం

T20

T20

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రెండో విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్‌పై 42 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 179 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేయగా…చివర్లో స్టొయినిస్‌ ధాటిగా ఆడాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 రన్స్ చేశాడు. మిచెల్‌ మార్ష్‌ 22 బంతుల్లో 28 ఓ మోస్తరుగా రాణించాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో బ్యారీ మెక్‌ కార్తీ మూడు వికెట్లు పడగొట్టగా.. జాషువ లిటిల్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ అద్భుతంగా పోరాడాడు. వికెట్లు పడుతున్నా ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు చేశాడు. అయితే మిగిలిన బ్యాటర్ల సపోర్ట్ లేకపోవడంతో అతని పోరాటం వృథా అయింది. టక్కర్ కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 రన్స్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 2, మ్యాక్స్‌వెల్‌ 2, స్టార్క్‌2 , జంపా 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీలో రెండో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.