world cup 2023: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజ‌యం

ధర్మశాలలో న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆసీస్ 5 ప‌రుగులు తేడాతో గెలుపొందింది. 389 ప‌రుగుల‌తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 383 ప‌రుగులు చేయగలిగింది.

world cup 2023: ధర్మశాలలో న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆసీస్ 5 ప‌రుగులు తేడాతో గెలుపొందింది. 389 ప‌రుగుల‌తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 383 ప‌రుగులు చేయగలిగింది. కివీస్ ఆటగాళ్లలో ర‌చిన్ ర‌వీంద్ర 89 బంతుల్లో 9 ఫోర్లు, 5సిక్స‌ర్లతో 116 పరుగులతో శ‌త‌కం నమోదు చేశాడు. అంతకుముందు డారిల్ మిచెల్ 51 బంతుల్లో 54 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 1 సిక్స్‌ నమోదైంది. జేమ్స్ నీష‌మ్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సహాయంతో 58 పరుగులతో గౌరవ ప్రదమైన స్కోర్ నమోదు చేశాడు. కాగా కివీస్ ఒక సెంచరీ ఇద్దరు హాఫ్ సెంచ‌రీల‌తో పోరాడినా జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. పాట్ క‌మిన్స్ , హేజిల్ వుడ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వికెట్ తీసుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ టార్గెట్ నిర్దేశించింది. డేవిడ్ వార్నర్ 81 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ (109) సెంచరీ తర్వాత ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ చేతిలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (18) పెద్దగా రాణించలేకపోయాడు. అతను కూడా స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ చేతిలో చిక్కుకున్నాడు. గత మ్యాచ్‌లో చారిత్రాత్మక సెంచరీ సాధించిన మ్యాక్స్‌వెల్.. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లీష్ మరియు పాట్ కమిన్స్ వరుసగా 38 మరియు 37 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది.

Also Read: world cup 2023: రచిన్ రవీంద్ర అద్భుత శతకం