Aus Beats India: తొలి టీ ట్వంటీలో ఆస్ట్రేలియా విజయం

ఆసియా కప్ వైఫల్యం నుంచి తేరుకుని టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న టీమిండియా ఆస్ట్రేలియాతో సీరీస్ ను ఓటమితో ఆరంభించింది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 10:39 PM IST

ఆసియా కప్ వైఫల్యం నుంచి తేరుకుని టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న టీమిండియా ఆస్ట్రేలియాతో సీరీస్ ను ఓటమితో ఆరంభించింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో రాహుల్ , సూర్య కుమార్ యాదవ్ తో పాటు హర్థిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్ తో రాణించి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్ అంతర్జాతీయ టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు. అటు ఈ మ్యాచ్ లో భారత్ పలు మార్పులు చేసింది. బూమ్రా స్థానంలో ఉమేష్ యాదవ్ చోటు దక్కించుకోగా…వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ ను ఆడించింది. కాగా భారత్ త్వరగానే కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాంలో ఉన్న కోహ్లీ వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగి ఆడారు. కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌ త్వరగానే ఔటైనా.. ఆ అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాకు దక్కకుండా చూశారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడి కేవలం 32 బాల్స్‌లోనే టీ ట్వంటీ ల్లో 18వ హాఫ్‌ సెంచరీ చేశాడు.రాహుల్ , సూర్య కుమార్ యాదవ్ మూడో వికెట్ కి 68 రన్స్ జోడించారు. మరోవైపు పాండ్య కూడా
మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగి పోయాడు.
కేవలం 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.అఖరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టి ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టడంతో భారత్ 208 పరుగులు చేసింది.

భారీ లక్ష్య చేదనలో ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కి 39 రన్స్ జోడించారు. ఫించ్ 22 రన్స్ చేయగా…గ్రీన్ , స్మిత్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ భారత్ బౌలర్ల పై ఆధిపత్యం కనబరిచి రెండో వికెట్ కు 70 రన్స్ పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే వీరిద్దరితో పాటు ప్రమాదకరమయిన మాక్స్ వెల్ ను ఉమేష్ యాదవ్ ఔట్ చేయడంతో మ్యాచ్ భారత్ గెలుచేలా కనిపించింది. అయితే టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. భారీ షాట్లతో రెచ్చిపోయారు. భువనేశ్వర్ చివర్లో 15 రన్స్ ఇవ్వడంతో ఆసీస్ విజయం కాస్త తేలికయింది. గాయం నుంచి కోలుకున్న హర్శల్ పటేల్ పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది. మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 6 ఫోర్లు , 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సీరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సీరీస్ లో రెండో మ్యాచ్ నాగ్ పూర్ వేదికగా శుక్రవారం జరుగుతుంది.