ఆస్ట్రేలియా(Australia )తో జరిగిన నాలుగో టెస్టులో భారత్(India ) 184 పరుగుల భారీ తేడాతో ఓటమిని (Australia beat India by 184 runs) చవిచూసింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. యశస్వి జైశ్వాల్ 84 పరుగులతో అద్భుతమైన అట తీరు కనపరచగా, రిషబ్ పంత్ 30 పరుగులు చేసి కొంతవరకు సహకరించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్‌ను ధ్వంసం చేశారు.
భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం ఈ ఓటమికి ప్రధాన కారణం. రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేయగా, కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ కూడా నిలదొక్కుకోలేకపోవడం వల్ల భారత్ విజయం సాధించే అవకాశం కోల్పోయింది. చివరికి యశస్వి జైశ్వాల్ కూడా అవుట్ కావడంతో భారత్ ఆశలు పూర్తిగా వదిలేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి తన తొలి టెస్ట్ సెంచరీ చేయడం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఫాలోఆన్ ప్రమాదం తప్పించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే వెనుదిరిగాడు.
ఈ టెస్ట్ లో స్టీవ్ స్మిత్ 140 పరుగులతో మెరవడంతో ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ కంగారూలను కుదిపేసినా, లబుషేన్ 70 పరుగులు చేసి విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. కమిన్స్, లియాన్ 41 పరుగులు చేయడంతో ఆసీస్ 234 పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్‌లో విజయంతో సిరీస్‌ను సమం చేసే ప్రయత్నం చేయాలని టీమిండియా ఎదురుచూస్తోంది.
Read Also : Farmers : పంజాబ్‌లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు