Natasa And Hardik: మా ఆయన్ని తక్కువ అంచనా వేయొద్దు

ఐపీఎల్ 2022 సీజన్ తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది.

Published By: HashtagU Telugu Desk
Pandya (1)

hardik pandya

ఐపీఎల్ 2022 సీజన్ తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ విజయం ఆ జట్టు కంటే కూడా ఆల్ రౌండర్, కెప్టెన్ హర్దిక్ పాండ్య కెరీర్ కు కీలకంగా నిలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సీజన్‌ ప్రారంభానికి ముందు పాండ్యాపై విమర్శలు దారుణంగా వచ్చాయి. ఫామ్‌లో లేని హార్దిక్‌ పాండ్యా జట్టును ఏం నడిపిస్తాడు.. ఆల్‌రౌండర్‌గా పనికిరాలేడు.. ఇక కెప్టెన్‌గా ఏం చేస్తాడంటూ చాలా మంది తేలిగ్గా తీసి పడేశారు. అయితే విమర్శకులకు తన ఆటతీరు , కెప్టెన్సీ తోనే పాండ్య జవాబిచ్చాడు.

తాజాగా పాండ్య విజయాన్ని ఆస్వాదిస్తున్న అతని భార్య నటాసా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గుజరాత్ టైటాన్స్ టీమ్ అద్బుతం…నా కుంగ్ ఫూ పాండ్య ను తక్కువ అంచనా వేయొద్దు…అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం నటాషా ట్వీట్ వైరల్ గా మారింది. పాండ్య పై విమర్శలు వచ్చినప్పుడు
నటాషా స్టాంకోవిక్‌ అండగా నిలబడింది. తన కొడుకు అగస్త్యతో కలిసి గుజరాత్‌ టైటాన్స్‌ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు హాజరై ఎంకరేజ్‌ చేస్తూ వచ్చింది. హార్దిక్‌ ఔటైన రోజున ముఖం మాడ్చుకోవడం.. అతను విజృంభించిన రోజున
తన భర్త కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో పాటు బౌలింగ్‌లోనూ.. కెప్టెన్‌గానూ మెరవడంతో నటాషా ఊరుకుంటుందా.. అందుకే గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గెలవగానే గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి పాండ్యాను గట్టిగా హగ్‌ చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

  Last Updated: 31 May 2022, 03:40 PM IST