Site icon HashtagU Telugu

Powell Vs Warner: సెంచరీ చేస్తావా..? నీకు అవకాశం ఇస్తా..

Warner

Warner

ఐపీఎల్ 2022 గురువారం జరిగిన మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సీనియర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై కసి తీర్చుకున్నాడు. తనను కెప్టెన్ గా తప్పించడమే కాదు…అవమానకరంగా బయటకు పంపించడంతో…ఎస్ఆర్ హెచ్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 92 పరుగులు సాధించి నౌటాట్ గా నిలిచాడు వార్నర్. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణమయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు విజయానికి డేవిడ్ వార్నర్, రావ్ మన్ పావెల్ వారధులుగా నిలవడమేకాదు…మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని…మరోక వికెట్ నష్టపోకుండా…మంచి ఆటతీరును కనబరుస్తూ…స్కోరును 207పరుగులకు చేర్చారు. అయితే లాస్ట్ ఓవర్ లో సెంచరీ చేసే అవకాశాన్ని వార్నర్ కు ఇస్తు బాగుంటుందని పావెల్ భావించాడు. అప్పటికే వార్నర్ 90 పరుగులు చేశారు. 20వ ఓవర్ ప్రారంభంలో ఒక సింగిల్ తీసాడు. స్ట్రయిక్ నీకు ఇస్తే సెంచరీ సాధిస్తావా అంటూ వార్నర్ ను అడిగాను…వార్నర్ క్రికెట్ ను ఆడే తీరు అది కాదు…నీవు వీలైనంత బ్యాటింగ్ చేయ్…నేను కూడా అదే చేశానని చెప్పాడు అంటూ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న వారిద్దరి మధ్య సంభాషణను పావెల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఐదో స్థానంలో తనను పంపించాలంటూ కెప్టెన్ రిషబ్ పంత్ ను కోరి మరీ క్రీజులోకి వచ్చి…బ్యాట్ తో తన సత్తా నిరూపించుకున్నాడు.