Site icon HashtagU Telugu

Harmanpreet Kaur: కొంపముంచిన హర్మన్‌ప్రీత్ కోపం.. ఆసియా క్రీడలకు దూరం..!?

Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur: ఆసియా క్రీడలు (Asian Games) 2023 క్వార్టర్ ఫైనల్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టు నేరుగా చోటు సంపాదించింది. దీంతో పాటు ఆసియా క్రీడల్లో టీ20 మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదా లభించింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే భారత జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోకి నేరుగా ప్రవేశించాయి. అయితే భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) క్వార్టర్‌ ఫైనల్‌తో పాటు సెమీఫైనల్‌లోనూ ఆడలేకపోతోంది. హర్మన్‌ప్రీత్ ఇటీవల రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైంది.

ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య మహిళల క్రికెట్ సిరీస్ జరిగింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అంపైరింగ్‌పై వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌లో అంపైరింగ్ పేలవంగా ఉంది ఉంది అని పేర్కొంది. దీంతో పాటు మరో ప్రకటన కూడా ఇచ్చారు. ఈ కారణంగా ఆమె రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైయింది. ఆసియా క్రీడల్లో క్వార్టర్, సెమీ ఫైనల్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు గెలిస్తేనే హర్మన్‌ప్రీత్‌కు అవకాశం దక్కుతుంది. ఇదే జరిగితే హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్ ఆడవచ్చు.

Also Read: Death Execution: 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు ఉరిశిక్ష.. ఎక్కడో తెలుసా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ఆసియా క్రీడల జట్టును ప్రకటించింది. ఇందులో హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఉంది. హర్మన్‌ప్రీత్‌కు కెప్టెన్సీ కూడా ఇచ్చారు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 19 నుంచి మహిళల క్రికెట్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 26న జరుగుతుంది. అదే రోజు బంగారు పతకం, కాంస్య పతకం కోసం మ్యాచ్‌లు జరుగుతాయి.

2023 ఆసియా క్రీడల కోసం భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్-కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి, అంజలి సార్వధ్యా రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా ఛెత్రి (WK), అనూష బారెడ్డి