Asian Games Schedule: నేడు ఆసియా గేమ్స్‌లో భారత షెడ్యూల్ ఇదే.. ఇవాళ ఎన్ని పతకాలు వస్తాయో..?

ఆసియా క్రీడల్లో (Asian Games Schedule) నాలుగో రోజు భారత ఆటగాళ్లు బలమైన ప్రదర్శన కనబరిచారు. బుధవారం భారత్‌ కు బంగారు పతకాలు వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Asian Games Schedule

Compressjpeg.online 1280x720 Image (1) 11zon (1)

Asian Games Schedule: ఆసియా క్రీడల్లో (Asian Games Schedule) నాలుగో రోజు భారత ఆటగాళ్లు బలమైన ప్రదర్శన కనబరిచారు. బుధవారం భారత్‌ కు బంగారు పతకాలు వచ్చాయి. దింతో భారత్ పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కనిపించింది. అయితే పతకాల పట్టికలో చైనా ఇప్పటికీ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు చైనా 140 పతకాలు సాధించగా అందులో 76 బంగారు పతకాలు ఉన్నాయి.

భారత ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి చరిత్ర సృష్టించనుంది

అయితే ఈరోజు భారత వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రోషిబినా దేవి 60 కిలోల ఉషులో ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ విధంగా రోషిబినా దేవి బంగారు పతకం సాధించే అవకాశం ఉంది. ఆసియా క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు వుషులో భారత్ ఎప్పుడూ బంగారు పతకం సాధించలేకపోయింది.

టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో పతకం ఖాయం

ఇది కాకుండా టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని, రామ్‌నాథన్ రామ్‌కుమార్‌ల జోడీ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా పతకం ఖాయమైంది. షూటింగ్, టెన్నిస్, వుషు, గుర్రపు స్వారీలో భారత్ గురువారం పతకాలు పొందవచ్చు.

Also Read: World Talent Ranking: ప్రపంచ టాలెంట్‌ ర్యాంకింగ్‌లో భారత్‌ ర్యాంక్ ఎంతంటే..?

నేడు భారత్ పోటీలు

షూటింగ్: ఈరోజు 7 షూటింగ్ ఈవెంట్‌లు జరగనున్నాయి. ఇందులో 5 ఫైనల్స్ ఉన్నాయి.

టెన్నిస్‌: పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత జోడీ సాకేత్‌ మైనేని, రామ్‌నాథన్‌ రామ్‌కుమార్‌ సెమీఫైనల్‌కు చేరారు. దీంతో టెన్నిస్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. ఈ భారత జోడీ సెమీ ఫైనల్‌లో చైనాకు చెందిన సియోంగ్‌చాన్ హాంగ్, సూన్‌వూ క్వాన్‌లతో తలపడనుంది.

ఈక్వెస్ట్రియన్: భారత్‌కు చెందిన హృదయ్ ఛేడా, అనూష్ అగర్వాల్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈరోజు ఫైనల్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

ఉషు: మహిళల సాండా 60 కేజీల ఫైనల్‌లో రోషిబినా దేవి బంగారు పతకాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. సెమీఫైనల్లో దేవి 2-0తో వియత్నాంకు చెందిన న్గుయెన్ థూను ఓడించింది. ఫైనల్‌లో రోషిబినా దేవితో చైనాకు చెందిన జియోవేయ్ వుతో తలపడనుంది.

  Last Updated: 28 Sep 2023, 07:24 AM IST