Rinku Singh: టీమిండియా క్రికెట‌ర్‌కు బెదిరింపులు.. రూ. 5 కోట్లు ఇవ్వాల‌ని డిమాండ్‌!

డబ్బులు డిమాండ్ చేసిన మొహమ్మద్ నవీద్ మొదటగా ఫిబ్రవరి 5న రింకూ సింగ్‌కు మెసేజ్ చేసి, తాను అతని పెద్ద అభిమానినని పేర్కొంటూ ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Rinku Singh

Rinku Singh

Rinku Singh: టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్‌ (Rinku Singh)కు అండర్‌వరల్డ్ నుండి బెదిరింపులు వచ్చాయి. దీనికి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ సమాచారం ఇచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. ఈ బెదిరింపు దావూద్ గ్యాంగ్ ద్వారా వచ్చిందని తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు కొందరిని అరెస్టు చేశారు.

రింకూ సింగ్‌ను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు

రింకూ సింగ్‌కు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 3 సార్లు బెదిరింపులు వచ్చాయి. అతని ప్రచార (ప్రమోషనల్) బృందానికి 3 సార్లు బెదిరింపు సందేశాలు వ‌చ్చాయి. దావూద్ గ్యాంగ్ చేసిన ఈ బెదిరింపుల్లో రింకూ సింగ్‌ను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారు బెదిరింపుల విషయాన్ని అంగీకరించారు. నివేదికల ప్రకారం.. రింకూ సింగ్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఈ ఇద్దరు వ్యక్తులను వెస్టిండీస్ నుండి పట్టుకున్నారు. వారిలో ఒకరి పేరు మొహమ్మద్ దిల్షాద్, మరొకరి పేరు మొహమ్మద్ నవీద్ అని తెలుస్తోంది.

Also Read: Gautam Gambhir: టీమిండియా ఆట‌గాళ్ల‌కి గౌతమ్ గంభీర్ ఇంట్లో డిన్నర్ పార్టీ!

ఆఖరిసారిగా ఆసియా కప్ 2025లో ఆడిన రింకూ సింగ్

స్టార్ ఆటగాడు రింకూ సింగ్‌ను ఆఖరిసారిగా ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ఆడుతూ క‌నిపించాడు. ఈ టోర్నమెంట్‌లో రింకూ సింగ్ టీమ్ ఇండియాలో భాగమైనప్పటికీ అతనికి కేవలం ఒక బంతి ఆడే అవకాశం మాత్రమే లభించింది. ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రమే రింకూ సింగ్‌ను చేర్చారు. ఫైనల్‌లో రింకూ టీమ్ ఇండియా కోసం విన్నింగ్ ఫోర్ కొట్టాడు.

బెదిరింపుల క్రమం

డబ్బులు డిమాండ్ చేసిన మొహమ్మద్ నవీద్ మొదటగా ఫిబ్రవరి 5న రింకూ సింగ్‌కు మెసేజ్ చేసి, తాను అతని పెద్ద అభిమానినని పేర్కొంటూ ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు. దీనిపై రింకూ సింగ్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత రెండవ బెదిరింపు సందేశంలో “నాకు 5 కోట్ల రూపాయలు కావాలి. స్థలం, సమయాన్ని నేను నిర్ణయిస్తాను” అని రాసి ఉంది. ఈ మెసేజ్‌ను ఏప్రిల్ 9న పంపారు. దీనికి కూడా రింకూ వైపు నుంచి ఎలాంటి ప్రతిచర్య లేదు. చివరి సందేశంలో “రిమైండర్ డి-కంపెనీ” అని రాసి ఉంది.

  Last Updated: 09 Oct 2025, 01:34 PM IST