Site icon HashtagU Telugu

India vs Pakistan: ఆసియా క‌ప్‌లో పాక్‌తో భార‌త్ మ్యాచ్ ఆడ‌తుందా? లేదా?

India vs Pakistan

India vs Pakistan

India vs Pakistan: ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ పత్రికా సమావేశంలో ఒక రిపోర్టర్ భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్‌పై ప్రశ్న అడిగినప్పుడు, బీసీసీఐ ఆ విషయాన్ని పక్కన పెట్టేందుకు ప్రయత్నించింది. రిపోర్టర్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అజిత్ అగార్కర్‌ను ఉద్దేశించి.. “సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య పెద్ద మ్యాచ్ జరగనుంది. గత రెండు నెలలుగా రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితుల దృష్ట్యా, ఈ మ్యాచ్‌పై మీ వైఖరి ఏమిటి?” అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న పూర్తి కాకముందే బీసీసీఐ మీడియా మేనేజర్ జోక్యం చేసుకొని “ఆగండి. జట్టు ఎంపికకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు” అని చెప్పడంతో రిపోర్టర్ మౌనంగా ఉండిపోయారు.

సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్

ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్‌ల మధ్య మహా పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొంతమంది భారతీయ అభిమానులలో ఈ మ్యాచ్ పట్ల ఆగ్రహం కనిపిస్తోంది.

Also Read: Cancellation of Student Visa : విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత అభిమానులు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీని ప్రభావం వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్‌పై కూడా పడింది. ఆ టోర్నమెంట్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించిన విష‌యం తెలిసిందే.

ఆసియా కప్ కోసం భారత జట్టు