Asia Cup Squad: కోహ్లీ,కెఎల్ రాహుల్ ఇన్…బూమ్రా ఔట్ ఆసియాకప్ కు భారత జట్టు

ఆసియాకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - August 8, 2022 / 10:53 PM IST

ఆసియాకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు. జింబాబ్వే టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఆసియాకప్ తో మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. ఫామ్ అందుకునేందుకు విరాట్ కు ఆసియాకప్ మంచి అవకాశం కావడంతో సెలక్టర్లు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

అలాగే గాయం నుంచి కోలుకుని కోవిడ్ బారిన పడి విండీస్ టూర్ కు దూరమైన కెఎల్ రాహుల్ కూడా ఆసియాకప్ తో మళ్ళీ పునరాగామనం చేయనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ , దీపక్ హుడా తమ స్థానాలు నిలపుకోగా.. ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్ పై వేటు పడింది.
ఇక గాయాలతో స్టార్ పేసర్ బూమ్రా దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బ. ఇప్పటికే హర్షల్ పటేల్ కూడా గాయం కారణంగానే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో పేస్ విభాగంలో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ లీడ్ చేయనుండగా.. అవేశ్ కాన్, అర్షదీప్ సింగ్ లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో సీనియర్ అశ్విన్ చోటు నిలుపుకోగా.. యువ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, చాహల్ కూడా చోటు దక్కించుకున్నారు. ఆల్ రౌండర్ కోటాలో హార్థిక్ పాండ్యా, జడేజా ఎంపికవగా.. వికెట్ కీపర్లుగా పంత్ తో పాటు దినేశ్ కార్తీక్ కూ చోటు లభించింది. అటు బ్యాకప్ ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యార్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఎంపికయ్యారు. మరోవైపు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లకు నిరాశ తప్పలేదు.

కాగా యుఏఈ వేదికగా ఆసియాకప్ ఆగస్టు 20 నుంచి జరగనుంది. ఈ సారి టీ ట్వంటీ ఫార్మాట్ లో టోర్నీ నిర్వహిస్తుండగా… భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ , పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ లతో పాటు ఆరో టీమ్ గా యుఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ క్వాలిఫైయింగ్ టోర్నీ ఆడనున్నాయి. ఆరంభ మ్యాచ్ లో భారత్, తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతుంది.