Site icon HashtagU Telugu

Asia Cup: ఆసియా క‌ప్‌కు భార‌త్ దూరం.. కార‌ణ‌మిదే?!

India Without Sponsor

India Without Sponsor

Asia Cup: ఆసియా కప్ 2025 (Asia Cup) సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే భారత్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. 2025 జులై 24న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే, బీసీసీఐ ఈ సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించింది. స్థలం మార్చకపోతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని తెలిపింది.

బీసీసీఐ కీల‌క నిర్ణయం

ఏఎన్‌ఐకి చెందిన విపుల్ కశ్యప్ సోర్సెస్ ప్రకారం బీసీసీఐ.. ఏసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఢాకాలో ఆసియా కప్‌కు సంబంధించిన సమావేశం జరిగితే టోర్నమెంట్‌కు సంబంధించిన ఏ విధమైన పరిష్కారాన్ని అయినా బహిష్కరిస్తామని బీసీసీఐ పేర్కొంది. భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ సంబంధాలలో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొని ఉంది. ఈ కారణంగానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆయ‌న ఇంకా మాట్లడుతూ.. ఢాకా నుండి ఏసీసీ సమావేశం స్థలాన్ని మార్చినట్లయితేనే ఆసియా కప్ జరుగుతుంది. మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ కోసం భారత్‌పై అనవసర ఒత్తిడి తెస్తున్నాడు. అతన్ని కార్యక్రమ స్థలాన్ని మార్చమని చెప్పినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ సమావేశం ఢాకాలో జరిగితే బీసీసీఐ ఏ విధమైన పరిష్కారాన్ని అయినా బహిష్కరిస్తుందని పేర్కొన్నారు.

Also Read: West Indies Players: వెస్టిండీస్‌కు మ‌రో బిగ్ షాక్‌.. రిటైర్మెంట్‌కు సిద్ధ‌మైన ఐదుగురు స్టార్ ప్లేయ‌ర్స్‌?!

బీసీసీఐకి ఇతర క్రికెట్ బోర్డుల మద్దతు

రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు. ఏసీసీ నియమాల ప్రకారం.. భారత్ వంటి ప్రధాన దేశం సమావేశంలో పాల్గొనకపోతే, ఏ నిర్ణయం కూడా చెల్లదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు వేరే స్థలంలో సమావేశాన్ని నిర్వహించకపోతే దానికి ఎలాంటి అర్థం ఉండదు. సమావేశానికి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏసీసీ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడిలో ఉంది.

ఆసియా కప్ రద్దు అవుతుందా?

2025 సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులు కొనసాగితే. ఈ పోటీ వాయిదా పడవచ్చు లేదా రద్దు కావచ్చు. బీసీసీఐ నిజానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో కీలక భాగం. భార‌త్ ఈ పోటీలో పాల్గొనకపోతే పరిస్థితులు దిగజారే అవ‌కాశం ఉంది.