Asia Cup 2025 Schedule: ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత భారత జట్టు తదుపరి ఆసియా కప్ 2025లో కనిపించనుంది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ (Asia Cup 2025 Schedule) ఇప్పుడు విడుదలైంది. దీని ప్రకారం చిరకాల ప్రత్యర్థులైన భారత్- పాకిస్థాన్ జట్లు ఈ టోర్నమెంట్‌లో పలుమార్లు తలపడే అవకాశం ఉంది. ఈ కారణంగానే టోర్నమెంట్‌పై అందరి దృష్టి నెలకొంది. ఈ టోర్నమెంట్‌లో భారత్- పాకిస్థాన్ జట్లు మొత్తం మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఈ టోర్నమెంట్‌పై అందరి దృష్టి ఉంటుంది.
ఆసియా కప్ 2025: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ
ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు.
- గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
- గ్రూప్ B: బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, హాంకాంగ్
- కొత్త షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 14, 2025న భారత్- పాకిస్థాన్ జట్లు గ్రూప్ దశలో తలపడనున్నాయి.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా రిటైర్మెంట్?!
భారత జట్టు ఇతర గ్రూప్ మ్యాచ్‌లు
- సెప్టెంబర్ 10న ఒమన్‌తో
- సెప్టెంబర్ 19న యూఏఈతో
మూడు సార్లు తలపడే అవకాశం?
ఈ టోర్నమెంట్‌లో భారత్- పాకిస్థాన్ జట్లు మొత్తం మూడు సార్లు ఎదురెదురు కావచ్చు.
- గ్రూప్ దశ: సెప్టెంబర్ 14న తొలి మ్యాచ్ జరగనుంది.
- సూపర్ 4 దశ: భారత్- పాకిస్థాన్ జట్లు సూపర్ 4కు చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అలా జరిగితే సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో ఈ రెండు జట్ల మధ్య మరో మ్యాచ్ జరగవచ్చు.
- ఫైనల్ మ్యాచ్: రెండు జట్లూ అద్భుతమైన ఆటతీరు కనబరిచి టోర్నమెంట్ అంతటా ఆధిపత్యం చెలాయిస్తే సెప్టెంబర్ 28, 2025న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా భారత్-పాకిస్థాన్ మధ్యే జరిగే అవకాశం ఉంది.
యూఏఈలో టీమ్ ఇండియాకు టీ20 రికార్డు అంత గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అదనపు బాధ్యత ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.