Asia Cup 2025: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్, వేదికలను ఖరారు చేసింది. ఈ ఏడాది ఆసియా కప్ మ్యాచ్‌లు అన్నీ సంయుక్త అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబీ, దుబాయ్‌లలో జరగనున్నాయి. అయితే ఈసారి టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్. ఈ మ్యాచ్ చుట్టూ జరుగుతున్న వివాదాలు, దాని వేదిక, ప్రాముఖ్యత గురించి వివరాలు తెలుసుకుందాం.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివరాలు
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి భారత క్రికెట్ అభిమానుల్లో, రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద చర్చ నడుస్తోంది.
టోర్నమెంట్ షెడ్యూల్
- సెప్టెంబర్ 9: ఆసియా కప్ ప్రారంభం
- సెప్టెంబర్ 10: భారత్ వర్సెస్ UAE (దుబాయ్)
- సెప్టెంబర్ 14: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)
Also Read: RBI MPC Meet: రాఖీ పండుగకు ముందు శుభవార్త చెప్పనున్న ఆర్బీఐ.. ఏంటంటే?
🚨 𝗔𝗡𝗡𝗢𝗨𝗡𝗖𝗘𝗠𝗘𝗡𝗧 🚨#ACCMensAsiaCup2025 confirmed to be hosted in Dubai and Abu Dhabi! 🏟️
The continent’s premier championship kicks off on 9th September 🏏
Read More: https://t.co/OhKXWJ3XYD#ACC pic.twitter.com/TmUdYt0EGF
— AsianCricketCouncil (@ACCMedia1) August 2, 2025
ఆడాలా, వద్దా?
ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో భారత లెజెండ్స్ జట్టు పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించిన తర్వాత ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది.
భారత్ పాకిస్తాన్‌తో ఆసియా కప్‌లో కూడా ఆడకూడదని కోరుకుంటోంది. దేశభక్తి, పాకిస్తాన్‌తో ఉన్న రాజకీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ఈ వాదన బలంగా వినిపిస్తోంది. ఒక దేశంగా మనం పాకిస్తాన్‌తో ఎలాంటి క్రీడా సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని, మ్యాచ్‌లు ఆడటం ద్వారా వారికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వకూడదని ఈ వర్గం అభిప్రాయం.
పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకపోతే భారత్ ఐసీసీ ర్యాంకింగ్‌లో నష్టపోతుందని మరో వర్గం వాదిస్తోంది. ఇది 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ క్వాలిఫికేషన్‌పై ప్రభావం చూపవచ్చు. భారత్ మ్యాచ్ ఆడకపోతే ఆ పాయింట్లు పాకిస్తాన్‌కు లభించి, భారత్‌కు బదులుగా పాకిస్తాన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఈ వాదన ప్రకారం.. కేవలం రాజకీయ కారణాలతో క్రీడా రంగంలో నష్టపోవడం సరైనది కాదు. భారత్ మ్యాచ్ ఆడితే గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకోవచ్చని ఈ వర్గం పేర్కొంటుంది.