Asia Cup 2025 in India: వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్ నిర్వహించనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asia Cup 2025 in India) ప్రకటించింది. త్వరలో జరగనున్న వన్డే, టీ20 ఫార్మాట్లకు బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యమిస్తాయని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశం తర్వాత బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్‌ను 2027లో నిర్వహిస్తుంది. ఇది వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. దీని తర్వాత 2029లో పాకిస్థాన్ ఈ టోర్నీని టీ-20 ఫార్మాట్‌లో నిర్వహిస్తుండగా.. 2031లో శ్రీలంక వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ మీడియా హక్కులు 2024 నుంచి 2031 వరకు ఎనిమిదేళ్ల పాటు వేలం వేయనున్నారు.
ఈ టోర్నీలో భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కోల్పోనుంది. ఎందుకంటే ఈ టోర్నీ T-20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. టీ20ల నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు రిటైర్ అయ్యారు. ఈ టోర్నీని 2025 డిసెంబర్‌లో నిర్వహించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఆసియా టోర్నమెంట్‌లో ఒక్కో ఎడిషన్‌లో 13 మ్యాచ్‌లు ఉంటాయని ACC తెలిపింది.
Also Read: Kishan Reddy : సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
టోర్నీలో భారత్-పాకిస్థాన్‌లు మూడుసార్లు తలపడతాయి
టోర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం.. భారత్- పాకిస్తాన్ మధ్య కనీసం రెండు ఫిక్స్‌డ్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే మూడోసారి టోర్నీలో ఆడవచ్చు. భారత్ చివరిసారిగా 2023లో పాకిస్థాన్‌తో రెండుసార్లు మ్యాచ్‌లు ఆడింది.
2024 నుంచి 2031 వరకు మూడు మహిళల టోర్నీలు జరగనున్నాయి
ఈ సమయంలో మూడు మహిళల ఆసియా కప్ టోర్నమెంట్లను కూడా నిర్వహించనున్నట్లు ACC తెలిపింది. ACC మీడియా హక్కుల కోసం US$170 మిలియన్ల ప్రాథమిక ధరను నిర్ణయించింది. ఇందులో ప్రతి ఆరు ACC టోర్నమెంట్‌లకు గ్లోబల్ టెలివిజన్, డిజిటల్, ఆడియో హక్కులు ఉంటాయి.
ఆసియాకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్ మరోసారి బలమైన పోటీదారుగా ఉండనుంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. అయితే ముగ్గురు భారతీయ ఆటగాళ్లు 2025 ఆసియా కప్ ఆడలేరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు గుడ్ బై చెప్పటంతో వారు ఆసియా కప్- 2025లో ఆడలేరు. ఒక నివేదిక ప్రకారం ఆసియా కప్ 2025 T20 ఫార్మాట్‌లో ఆడబడుతుంది. దీనికి కారణం 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ అని పలు నివేదికలు పేర్కొన్నాయి.