BCCI: సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్‌ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌పై భారతదేశ ప్రజల్లో చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని కారణంగా సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ నిర్వహణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు బీసీసీఐ (BCCI) అధికారులు కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది.
బీసీసీఐ అధికారులు ముఖం చాటేశారా?
మీడియా నివేదికల ప్రకారం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడటానికి బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఏ అధికారి కూడా దుబాయ్ చేరుకోలేదు. ఈ మ్యాచ్ రేపు అంటే సెప్టెంబర్ 14న జరగనుంది. గతంలో భారత్-పాక్ మ్యాచ్‌కి బీసీసీఐ అధికారి హాజరు కాకుండా ఉండటం ఎప్పుడూ జరగలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్‌లో ఒక మ్యాచ్ జరిగింది., ఆ సమయంలో చాలా మంది బీసీసీఐ అధికారులు మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లారు.
Also Read: Putin Closest Friend: ఈనెలలో భారత్‌ను సందర్శించనున్ను రష్యా నిపుణుడు!
మ్యాచ్‌కు వ్యతిరేకత
ఆసియా కప్‌లో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ కూడా ఈ మ్యాచ్‌ను చూడకూడదని నిర్ణయించుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా కూడా ఈ మ్యాచ్‌కు హాజరు కావడం కష్టం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న మహిళల ప్రపంచ కప్ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు.
మ్యాచ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఆపాలని కోరుతూ నలుగురు న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను వెంటనే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు ఈ మ్యాచ్ టికెట్లు కూడా ఇంకా పూర్తిగా అమ్ముడుపోలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి భారత్-పాక్ మ్యాచ్ సమయంలో స్టేడియం ఖాళీగా కనిపించవచ్చు.