Site icon HashtagU Telugu

Asia Cup 2025: ఆసియా కప్ 2025: పాకిస్తాన్‌పై ఎందుకు దాడి చేసినట్లు ఆడానో అభిషేక్ శర్మ వెల్లడి

Abhisekh Sharma

Abhisekh Sharma

Asia Cup 2025: ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ అనంతరం భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. మ్యాచ్ సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు అవసరములేని ఆగ్రహంతో తమపైకి వచ్చారని, ఇది తనకు ఎంతమాత్రం నచ్చలేదని చెప్పారు. దానికి తాను దెబ్బకు దెబ్బ తినిపించిన తీరుగా గట్టి బ్యాటింగ్ చేయడమేనని అభిషేక్ స్పష్టంగా చెప్పారు.

అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. శుబ్ మన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు నాకు నచ్చలేదు. నేను బౌలర్లకు మాటల్లో కాదు, బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాను అని అన్నారు.

అభిషేక్ తన టీమ్‌ మెట్ శుభ్మన్ గిల్‌తో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ, ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలసి ఆడుతున్నామని, బాగా అర్థం చేసుకుంటామని చెప్పారు. ఈ రోజు గిల్‌ను చూసి తాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు.

తన బ్యాటింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ, “నాకు టీమ్ పూర్తి సపోర్ట్ ఇస్తోంది. అదే నా ఆటలో చూపిస్తున్న ఉద్దేశం. కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాను. నా రోజు అయితే, మ్యాచ్‌ను గెలిపించేందుకు పక్కా ట్రై చేస్తాను” అని చెప్పారు.

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తక్కువ ప్రభావాన్ని చూపారు. నాలుగు ఓవర్లలో 10కు పైగా రన్స్ ఇచ్చారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. “అది
నార్మలే. అతను రోబో కాదు. ఒక్కోసారి ఎవరికైనా చెడు రోజు ఉండే ఉంటుంది. కానీ శివం దూబే అద్భుతంగా సెట్యుయేషన్‌ను హ్యాండిల్ చేశాడు” అని చెప్పారు.

Abhisekh In Asia Cup

శుబ్ మన్ గిల్‌ అభిషేక్ జోడీపై ప్రశంసలు కురిపించిన సూర్యకుమార్, ఇద్దరూ ఒకరిని ఒకరు చక్కగా కాంప్లిమెంట్ చేస్తారంటూ “ఫైర్ అండ్ ఐస్” కాంబినేషన్ అంటూ అభివర్ణించారు. నాలుగు క్యాచ్‌లు డ్రాప్ అయిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ అందరికీ మెయిల్ చేస్తారేమో అంటూ అర్ధ చమత్కారంగా వ్యాఖ్యానించారు.

మ్యాచ్ ప్రారంభంలో మొదటి 10 ఓవర్లలో పాకిస్తాన్ బాగా ఆడినప్పటికీ, తర్వాత భారత జట్టు చక్కగా ఫైట్‌బ్యాక్ ఇచ్చిందని సూర్య చెప్పారు. “మొదటి 10 ఓవర్లు అయ్యాక, డ్రింక్స్ బ్రేక్‌లోనే నేను ప్లేయర్లతో మాట్లాడాను – అసలు మ్యాచ్ ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పాను” అని వెల్లడించారు.

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా మ్యాచ్‌పై స్పందించారు. “మేము ఇంకా పర్ఫెక్ట్ మ్యాచ్ ఆడలేదని అంగీకరిస్తున్నా. కానీ ప్రగతిలో ఉన్నాం. పవర్‌ప్లేలో వాళ్ల బ్యాటింగ్ స్టైల్‌తో మ్యాచ్ బయటకు వెళ్లిపోయింది. మేము 10 ఓవర్ల తర్వాత మరికొన్ని పరుగులు చేసి ఉంటే స్కోర్ 180 అయ్యేది. కానీ వాళ్ల ఆరంభం మా ప్లాన్స్ మొత్తం చెడగొట్టింది” అని చెప్పారు.

Exit mobile version