Site icon HashtagU Telugu

India Squad: ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇదేనా..?

India Squad

TEAMINDIA

India Squad: ఆసియా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి 20 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. అయితే ఇప్పటి వరకు బీసీసీఐ ఈ టోర్నీకి టీమిండియా జట్టు (India Squad)ను ప్రకటించలేదు. ఓ నివేదిక ప్రకారం.. భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన తర్వాత BCCI ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాను ప్రకటించనున్నట్లు సమాచారం. దీనికి ముందు ఈ టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ఎవరెవరూ ఉంటారో చూద్దాం.

శిఖర్ ధావన్‌కు మళ్లీ నిరాశే

ఆసియా క్రీడలకు ఎంపిక కాకపోవడంతో నిరాశకు గురైన శిఖర్ ధావన్ మరోసారి టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవచ్చు. ఆసియా కప్‌లో ఓపెనింగ్‌కు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బలమైన పోటీదారులు. అయితే రిజర్వ్ ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీని తర్వాత మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే.. విరాట్ కోహ్లీ మూడవ నంబర్‌లో ఆడటం ఖాయం. మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ నాలుగో నంబర్‌కు తిరిగి జట్టులోకి వస్తే అతని బ్యాక్ అప్ గా సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఎంచుకోవచ్చు. దీని తర్వాత KL రాహుల్ ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తే జట్టుకు ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటాడు.

Also Read: BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. గత ఐదేళ్లలో ఆదాయం ఎంతో తెలుసా..?

ఆల్ రౌండర్ ప్లేయర్ల గురించి చెప్పాలంటే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం ఖాయం. మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ కూడా బుమ్రాతో పాటు బౌలింగ్ విభాగం చూసుకునే అవకాశం ఉంది.

2023 ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ముఖేష్ కుమార్.

Exit mobile version