Site icon HashtagU Telugu

IND vs SL: IND vs SL ఫైనల్ మ్యాచ్ ప్లేయింగ్ XI

IND vs SL

IND vs SL

IND vs SL: సెప్టెంబరు 17న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మరియు శ్రీలంక జట్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సునాయాస విజయంతో సూపర్ ఫోర్ దశలో భారత్ తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయం. కాబట్టి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు డగౌట్ కే పరిమితం కానున్నారు. అక్షర్ పటేల్ గత మ్యాచ్ లో గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే అవకాశముంది. వెన్ను నొప్పి కారణంగా శ్రేయాస్ అయ్యర్ కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్ ఆసియా కప్ 2023 ఫైనల్‌కు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. సో ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో శ్రేయాస్ జట్టులోకి వచ్చే అవకాశముంది.

భారత్ ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ .

శ్రీలంక ప్లేయింగ్ XI: కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, దసున్ షనక (c), ధనంజయ్ డి సిల్వా, దునిత్ వెలలేజ్, ప్రమోద్ మధుషన్, దుషన్ హేమంత, కస్సున్ హేమంత, రజిత.

Also Read: Book My CM : ‘బుక్ మై సీఎం’ పోస్టర్ల కలకలం.. వాటిలో ఏం రాశారంటే.. ?

Exit mobile version