India All Out: 266 పరుగులకు టీమిండియా ఆలౌట్.. షాహీన్ అఫ్రిదికి నాలుగు వికెట్లు..!

ఆసియా కప్‌ 2023లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులు చేసి (India All Out) కుప్పకూలింది.

  • Written By:
  • Updated On - September 2, 2023 / 08:06 PM IST

India All Out: ఆసియా కప్‌ 2023లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులు చేసి (India All Out) కుప్పకూలింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు స్కోరు 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున షాహీన్ అఫ్రిది 4 వికెట్లు తీయగా, నసీమ్ షా, హరీస్ రవూఫ్ మూడేసి వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి 4 ఓవర్లకు రోహిత్, గిల్ జోడీ జాగ్రత్తగా ఆడి స్కోరును 15 పరుగులకు చేర్చింది. ఆ తర్వాత వర్షం కారణంగా దాదాపు 20 నిమిషాల పాటు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. మ్యాచ్ పున:ప్రారంభం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రూపంలో భారత జట్టుకు రెండు పెద్ద షాక్‌లు తగిలాయి.

Also Read: Team India: ఆసియా కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!

పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది మొదట తన అద్భుతమైన ఇన్‌స్వింగ్ బాల్‌లో రోహిత్ శర్మను బౌల్డ్ చేసి భారత్‌ ని దెబ్బతీశాడు . ఆ తర్వాత విరాట్ కోహ్లీ జట్టు 27 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీని తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్.. వచ్చిన వెంటనే పరుగులు చేసేందుకు ప్రయత్నించినా.. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హరీస్ రవూఫ్‌కు వికెట్ ఇచ్చాడు. 66 పరుగుల వద్ద శుభమన్ గిల్ రూపంలో టీమ్ ఇండియాకు నాలుగో వికెట్ పడటంతో ఇండియా బ్యాట్స్ మెన్ పై పాక్ బౌలర్ల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.

ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87), ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82) ఇద్దరూ అర్ధ శతకాలతో అదరగొట్టి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఐదో వికెట్‍కు 138 పరుగులను భాగస్వామ్యాన్ని జోడించారు. వీరిద్దరూ ఔట్ అయ్యేసరికి భారత్ స్కోరు 43.1 ఓవర్లలో 239/6. దీంతో మ్యాచ్‌ను ముగించే బాధ్యత రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌ తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విఫలమవడంతో టీమ్ ఇండియా 300 మార్కును దాటలేకపోయింది.