India vs England: ఐసీసీ ప్రపంచకప్ 2023లో విజయంతో ‘పంచ్’ కొట్టిన టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నారు. అదే సమయంలో బౌలింగ్‌లో స్పిన్నర్లతో పాటు బుమ్రా, షమీ కూడా బ్యాట్స్‌మెన్స్ ను కట్టడి చేస్తున్నారు.
హార్దిక్ తిరిగి వస్తాడా..?
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యాకు ఇంగ్లండ్‌తో ఆడటం చాలా కష్టంగా కనిపిస్తోంది. హార్దిక్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. హార్దిక్ గాయం విషయంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ తొందరపడి ఏమీ చేయదలుచుకోలేదు. ఇంగ్లండ్‌పై హార్దిక్ రంగంలోకి దిగకపోతే.. సూర్యకుమార్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్ మరోసారి నమ్మకం ఉంచే అవకాశం ఉంది.
అశ్విన్ జట్టులోకి..?
లక్నోలోని ఎకానా స్టేడియం స్పిన్ బౌలర్లకు చాలా సహాయాన్ని అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌పై ముగ్గురు స్పిన్నర్లతో కెప్టెన్ రోహిత్ బరిలోకి దిగవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడం ఖాయమని భావిస్తున్నారు. అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌కి తిరిగి వస్తే మహ్మద్ షమీ లేదా సిరాజ్ బెంచ్‌పై కూర్చోవలసి ఉంటుంది. గత మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీశాడు. అంటే ఇటీవల ఫామ్ ను పరిశీలిస్తే సిరాజ్ కు రెస్ట్ ఇవ్వొచ్చు.
Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కి సన్నాహాలు.. డిసెంబర్ 19న దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం..?
టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది
2023 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ చాలా బాగా రాణిస్తుంది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి టీమిండియాకు శుభారంభం అందించడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ మిడిల్ ఓవర్లలో బలంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేయగా, న్యూజిలాండ్‌పై విరాట్ 95 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా బ్యాట్స్‌మెన్‌కు ముప్పుగా మారాడు. మహ్మద్ షమీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్నింగ్ బంతులు కూడా బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇంగ్లండ్ తో మ్యాచ్ కి టీమిండియా జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ/ మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.