Site icon HashtagU Telugu

Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్ కి ప్రధాన కారణాలు అవేనా..?

Ashwin Retirement

Ashwin Retirement

Ashwin Retirement: బ్రిస్బేన్ టెస్టులో ఐదో రోజు రెండో సెషన్ ముగియనున్న తరుణంలో ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ (Ashwin Retirement) పై వార్తలు రావడం మొదలైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్‌గా ఉన్న అశ్విన్‌ని చూసిన విరాట్ కోహ్లీ అతడిని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటు మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్‌తో కలిసి ఆర్ అశ్విన్ కనిపించాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ మధ్య అశ్విన్ అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు? అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను తెలుసుకుందాం.

గబ్బా టెస్ట్ మ్యాచ్ తర్వాత అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఈ ప్రశ్న ప్రతి అభిమాని మదిలో మెదులుతూనే ఉంటుంది. ఆస్ట్రేలియా గడ్డపై అశ్విన్ ప్రత్యేక ప్రదర్శన ఏమీ చేయలేకపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడిలైడ్ టెస్టులో అతనికి అవకాశం లభించినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అడిలైడ్‌లో జరిగిన డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో అశ్విన్ ఆవేదనకు గురయ్యాడు.

Also Read: Virat Kohli: అశ్విన్‌ రిటైర్‌మెంట్‌పై విరాట్‌ కోహ్లి భావోద్వేగం!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలు అశ్విన్‌కు ప్లేయింగ్-11లో అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత అడిలైడ్ టెస్ట్‌లో ప్లేయింగ్-11లోకి వచ్చాడు. ఇక్కడ కూడా కోచ్-కెప్టెన్‌ను కట్టుకోలేకపోయాడు. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్‌లో అతన్ని బెంచ్‌పై ఉంచారు. అతని స్థానంలో రవీంద్ర జడేజాకు అవకాశం లభించడంతో జడేజా అద్భుత ప్రదర్శన చేసి సెలెక్టర్ల నిర్ణయం సరైనదేనని నిరూపించాడు.ఇక్కడ కూడా అశ్విన్ పై ప్రదర్శన చర్చనీయంశమైంది.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై అందరూ విశ్వాసం వ్యక్తం చేసిన తీరు చూసి ఆర్ అశ్విన్ బ్యాటింగ్ పై ఎవరికీ నమ్మకం లేదనిపించింది. జడేజా అద్భుత ప్రదర్శన తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లలో అశ్విన్ బెంచ్‌పై కూర్చుంటాడని అనిపించింది. అటువంటి పరిస్థితిలో అతను సిరీస్ ముగిసేలోపు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించి ఉండవచ్చు.