సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఉత్కంఠగా సాగిపోతున్న వేళ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మిల్లర్ ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసే అవకాశాన్ని వదిలేసాడు.ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఇది జరిగింది. ఆ ఓవర్‌లో అశ్విన్ చివరి బంతిని వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మిల్లర్ క్రీజు బయట ఉన్నాడు.
ఇది గమినించిన అశ్విన్ బంతి వేయడం ఆపేసి మిల్లర్‌కు..”యూ ఆర్ ఔట్ ఆఫ్ క్రీజ్” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే రూల్స్ ప్రకారం మిల్లర్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వదిలేయడం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే గతంలో ఐపీఎల్ వేదికగా బట్లర్ ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసి వార్తల్లో నిలిచిన అశ్విన్ ఈసారి మాత్రం క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు. అయితే అశ్విన్ క్రీడాస్ఫూర్తిపై ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.
ఎందుకంటే భారత్ పై సౌతాఫ్రికా గెలవడంలో మిల్లర్ దే కీలకపాత్ర. మ్యాచ్ ను మలుపు తిప్పే మిల్లర్ లాంటి ఆటగాడి విషయంలో అశ్విన్ ఇలా వ్యవహరించడం ఫ్యాన్స్ కు రుచించలేదు. యాష్ ఎంత పని చేశావ్ అంటూ బాధపడుతున్నారు.