Virat Kohli: కోహ్లీ క్రీజులో ఉన్నంత వరకు.. ఇండియా మ్యాచ్ ఓడిపోయినట్లు కాదు: పాకిస్థాన్ బౌలర్ ఆమిర్

టెస్ట్ మ్యాచ్ అయినా, టీ20 అయినా, వన్డే అయినా తిరుగులేని ఆటతో చెలరేగడం కోహ్లీ నైజం.

Published By: HashtagU Telugu Desk
Happy Birthday Virat Kohli

Virat Kohli Imresizer

Virat Kohli: టెస్ట్ మ్యాచ్ అయినా, టీ20 అయినా, వన్డే అయినా తిరుగులేని ఆటతో చెలరేగడం కోహ్లీ నైజం. పరుగులను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకునే కోహ్లీ క్రీజులో కుదురుకున్నాడంటే ఎలాంటి బౌలర్ అయినా ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. అది పాకిస్థాన్ అయినా, ఆస్ట్రేలియా అయినా.. కోహ్లీ ముందు తలొగ్గాల్సిందే. ఈ నేపథ్యంలో పాక్ లెజెండరీ పేసర్ మహమ్మద్ ఆమిర్ టీమిండియా బ్యాటర్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ మరోసారి తానేంటో నిరూపిస్తూ పాకిస్తాన్‌పై భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ మ్యాచులో భారత్ ఓడిపోవడం ఖాయమని కోహ్లీ తప్ప అంతా అనుకున్నారు. చివరకు అందరూ తప్పేనని, తనే కరెక్టని కోహ్లీ నిరూపించాడు.

అజేయమైన 82 పరుగులతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.  ‘కోహ్లీ అక్కడ ఉన్నంత వరకు.. ఇండియా మ్యాచ్ ఓడిపోయినట్లు కాదు. అలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్‌ను కోహ్లీ తప్ప ప్రపంచంలో మరెవరూ ఆడలేరు. పాకిస్తాన్‌పై ఆడిన ఆ ఇన్నింగ్స్ తన కెరీర్ బెస్ట్ అని ఒప్పుకుంటాడు’ అని ఆమిర్ అన్నాడు. కానీ ఆమిర్ మాత్రం కోహ్లీ క్రీజులో ఉంటే మ్యాచ్ ముగిసినట్లు కాదనే ఆలోచనలోనే ఉన్నట్లు చెప్పాడు.

మూడు ఓవర్లలో 48 పరుగులు అవసరమైనప్పుడు బ్యాట్ తో చెలరేగి ఇండియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు’’ అని కోహ్లీపై  ప్రశంసలు కురిపించాడు. త్వరలో వన్డే ప్రపంచకప్ ఫైట్ జరుగబోతుండటంతో అందరి కళ్లు ఈ బ్యాటర్ పైనే ఉన్నాయి. ఇక త్వరలో విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  Last Updated: 03 Oct 2023, 01:47 PM IST