Site icon HashtagU Telugu

Aryna Sabalenka: యూఎస్ ఓపెన్ మ‌హిళ‌ల సింగిల్స్ విజేత‌గా స‌బ‌లెంకా..!

Aryna Sabalenka

Aryna Sabalenka

Aryna Sabalenka: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా (Aryna Sabalenka) గెలుచుకుంది. యూఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. ఆమెకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అంతకుముందు ఆమె 2023, 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె 2021, 2023లో వింబుల్డన్, 2023లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఆమె ప్రస్తుత ర్యాంకింగ్ నంబర్ టూ. ఫైనల్‌లో సబలెంకా 7-5, 7-5తో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ యాన్నిక్ సిన్నర్- టేలర్ ఫ్రిట్జ్ మధ్య జరుగుతుంది.

యుఎస్ ఓపెన్ 2024లో బెలారస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అరీనా సబలెంకా, అమెరికాకు చెందిన జెస్సికా పెగులా మధ్య ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్‌లో ఇద్దరు క్రీడాకారిణీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే చివరికి అమెరికాకు చెందిన జెస్సికా పెగులా బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ విజయంతో అరీనా సబలెంకా తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అరీనా సబలెంకాకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్.

Also Read: NSA Ajit Doval : రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు.. మాస్కోకు భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్!

ఇదీ మ్యాచ్‌ పరిస్థితి

ప్రపంచ రెండో ర్యాంకర్ టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా 7-5, 7-5తో రెండు వరుస సెట్లలో పెగులాను ఓడించింది. మ్యాచ్ సమయంలో పెగులా.. అరేనా ముందు చాలా కష్టపడుతున్నట్లు కనిపించింది. కానీ అరేనా అమెరికన్ క్రీడాకారిణికి పునరాగమనం చేయడానికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌లో ఒక దశలో అరెనా 0-3తో వెనుకబడి ఉంది. అయితే బ్రేక్ పాయింట్ నుండి తిరిగి వచ్చిన తర్వాత స‌బ‌లెంకా.. పెగులాపై 5-3 ఆధిక్యం సాధించింది. చివరికి మ్యాచ్‌ను గెలుచుకుంది.

ఒకే సీజన్‌లో రెండు హార్డ్‌కోర్ట్ మేజర్‌లను గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి

26 ఏళ్ల అరీనా సబాలెంకా 40 విజ‌యాల‌ను సాధించింది. ఇప్పుడు 2016లో ఏంజెలిక్ కెర్బర్ తర్వాత ఒకే సీజన్‌లో రెండు హార్డ్‌కోర్ట్ మేజర్‌లను గెలుచుకున్న మొదటి మహిళా క్రీడాకారిణిగా అవతరించింది. US ఓపెన్ 2023 ఫైనల్‌లో సబాలెంకా అమెరికాకు చెందిన కోకో గాఫ్‌తో ఓడిపోయింది, కానీ ఈసారి ఆమె ఎలాంటి పొరపాటు చేయలేదు.