Site icon HashtagU Telugu

Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఎందుకు చారిత్రాత్మకమైనది..?

Arshdeep Singh

Safeimagekit Resized Img 11zon

Arshdeep Singh: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అర్ష్‌దీప్ ఈ సిరీస్‌లో అత్యధికంగా 10 వికెట్లు పడగొట్టాడు. దానితో అతను తన పేరిట కొన్ని రికార్డులను కూడా సృష్టించాడు. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనే అర్ష్‌దీప్ ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీని తర్వాత రెండో మ్యాచ్‌లో 1 వికెట్, మూడో మ్యాచ్‌లో 4 వికెట్లు తీశాడు.

ఈ సిరీస్ ద్వారా అర్ష్‌దీప్ తన ODI కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికాతో జరిగిన ODI మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ద్వారా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కూడా సాధించాడు. అంతే కాకుండా ఎన్నో రికార్డుల్లో తన పేరు రాసుకున్నాడు. అయితే దక్షిణాఫ్రికాపై అర్ష్‌దీప్ సింగ్ ఎలాంటి రికార్డులు సాధించాడో తెలుసుకుందాం.

Also Read: New Kia Cars: మార్కెట్ లోకి మూడు కొత్త కార్లను తీసుకొస్తున్న కియా మోటార్స్.. వాటి వివరాలివే..!

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ఎక్కువసార్లు 4 వికెట్లు తీసిన ఆటగాళ్లు

3 – యుజ్వేంద్ర చాహల్
3 – కుల్దీప్ యాదవ్
2 – సునీల్ జోషి
2 – అనిల్ కుంబ్లే
2 – అర్ష్‌దీప్ సింగ్

We’re now on WhatsApp. Click to Join.

దక్షిణాఫ్రికాలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధికంగా 4+ వికెట్లు సాధించిన బౌలర్స్

2 – కీత్ ఆర్థర్టన్ (వెస్టిండీస్, 1998/99)
2 – బ్రెట్ లీ (ఆస్ట్రేలియా, 2001/02)
2 – యుజ్వేంద్ర చాహల్ (భారతదేశం, 2017/18)
2 – కుల్దీప్ యాదవ్ (భారతదేశం, 2017/18)
2 – అర్ష్‌దీప్ సింగ్ (భారతదేశం, 2023/24).

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్స్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

5/37 – అర్ష్‌దీప్ సింగ్, జోహన్నెస్‌బర్గ్, 2023*
4/27 – వెంకటేష్ ప్రసాద్, ముంబై WS, 1996
4/27 – అవేష్ ఖాన్, జోహన్నెస్‌బర్గ్, 2023
4/29 – మునాఫ్ పటేల్, జోహన్నెస్‌బర్గ్, 2011
4/30 – అర్ష్‌దీప్ సింగ్, పార్ల్, 2023.

అర్ష్‌దీప్ సింగ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 6 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 2 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేయగా, అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ చివరి మూడు మ్యాచ్‌లలో 3 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తూ అతను తన పేరిట 10 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత లెఫ్టార్మ్ పేసర్ 5 వికెట్లు తీశాడు. దీని తర్వాత సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో 1 వికెట్ అందుకున్నాడు. ఆపై మూడవ, చివరి మ్యాచ్‌లో 4 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు.

 

Exit mobile version