Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ చెత్త‌ రికార్డు.. T20I చరిత్రలో అత్యంత పొడవైన ఓవర్!

ఈ ఓవర్‌తో అర్ష్‌దీప్ సింగ్ తన పేరును ఒక అవమానకరమైన జాబితాలో నమోదు చేసుకున్నాడు. అర్ష్‌దీప్ T20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత పొడవైన ఓవర్ వేసిన బౌలర్‌గా నిలిచాడు.

Published By: HashtagU Telugu Desk
Arshdeep Singh

Arshdeep Singh

Arshdeep Singh: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) లయ తప్పినట్లు కనిపించాడు. మొదటి T20లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్‌ను ముల్లాన్‌పూర్‌లో ప్రోటీస్ (దక్షిణాఫ్రికా) బ్యాట్స్‌మెన్ దారుణంగా దండించారు. మొదటి, రెండో ఓవర్‌లో పరుగులు ధారాళంగా సమర్పించుకున్న తర్వాత తన స్పెల్ మూడో ఓవర్‌లో అర్ష్‌దీప్ విపరీతమైన ఒత్తిడికి గురైనట్లు కనిపించాడు. అర్ష్‌దీప్ ఒకటి లేదా రెండు కాదు ఏకంగా 7 వైడ్ బంతులు వేశాడు. ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ వేసిన ఆ ఓవర్ ఒక ‘మారథాన్’ ఓవర్‌గా మారింది. తన మూడో ఓవర్‌ను పూర్తి చేయడానికి అర్ష్‌దీప్‌కు మొత్తం 13 బంతులు అవసరమయ్యాయి.

అర్ష్‌దీప్ వేసిన 13 బంతుల ఓవర్

రెండు ఓవర్ల స్పెల్‌లో ఇప్పటికే 20 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11వ ఓవర్ వేసే బాధ్యత అప్పగించాడు. అర్ష్‌దీప్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతినే డికాక్ బౌండరీ దాటించాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ తన లైన్ అండ్ లెంగ్త్‌ను పూర్తిగా మరచిపోయినట్లు కనిపించాడు. భారత ఫాస్ట్ బౌలర్ వరుసగా ఆరు వైడ్‌లు వేశాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ రెండు బంతులను సరైన లైన్‌లో వేశాడు. కానీ మళ్లీ తర్వాతి బంతిని వైడ్ వేశాడు. ఈ విధంగా అర్ష్‌దీప్ ఏడు వైడ్‌లు విసరగా.. తన ఓవర్‌ను పూర్తి చేయడానికి అతనికి మొత్తం 13 బంతులు పట్టింది.

Also Read:Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ 

T20I లో అత్యంత పొడవైన ఓవర్

ఈ ఓవర్‌తో అర్ష్‌దీప్ సింగ్ తన పేరును ఒక అవమానకరమైన జాబితాలో నమోదు చేసుకున్నాడు. అర్ష్‌దీప్ T20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత పొడవైన ఓవర్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ మాదిరిగానే 2024 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్-ఉల్-హక్ కూడా 13 బంతుల ఓవర్‌ను వేశాడు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అర్ష్‌దీప్ మాత్రమే కాదు ఈ రెండో T20లో జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లక్ష్యంగా మారారు.

  Last Updated: 11 Dec 2025, 10:23 PM IST