Site icon HashtagU Telugu

INDIA Squad Australia T20: టీ20 సిరీస్ కు భారత మహిళా జట్టు ప్రకటన

Indian Women

Indian Women

డిసెంబర్ 9 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పూజా వస్త్రాకర్ రూపంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా పూజకు దూరమైందని, అందుకే ఆమె ఎంపికపై ఎలాంటి పరిశీలన లేదని బీసీసీఐ తెలిపింది.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే.. మొదటి రెండు మ్యాచ్ లు డివై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి. దీని తర్వాత సిరీస్‌లోని చివరి మూడు మ్యాచ్‌లు వరుసగా డిసెంబర్ 14, 17, 20 తేదీల్లో CCI-బ్రబోర్న్ స్టేడియంలో జరగనున్నాయి. డిసెంబర్ 9న 1వ T20I – DY పాటిల్ స్టేడియం, డిసెంబర్ 11న 2వ T20I D.Y పాటిల్ స్టేడియం, డిసెంబర్ 14న 3వ T20I – CCI, డిసెంబర్ 17న 4వ T20I – CCI, డిసెంబర్ 20న 5వ T20I – CCI బ్రబోర్న్ స్టేడియంలో జరగనున్నాయి.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, దేవిక వైద్య, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.