Site icon HashtagU Telugu

Arjun Tendulkar: సచిన్ తనయుడికి ఛాన్స్ ఇస్తారా ?

Arjun Tendulkar

Arjun Tendulkar

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంచేసేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్‌కు ఇప్పటి వ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవ‌కాశం రాలేదు. అయితే ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు అర్జున్ టెండ్యూల్కర్ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. అతని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్‌ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో అర్జున్ బౌలింగ్ చేసిన విధానానికి ఫిదా అయిన అభిమానులు ఢిల్లీతో మ్యాచ్ లో ఎలాగైనా ముంబై తుది జ‌ట్టులో అతడికి ఛాన్సివ్వాలని కోరుతున్నారు.
మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియ‌న్స్ రూ.30 ల‌క్షల‌కు కొనుగోలు చేసింది. మరోవైపు ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ సమీకరణాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకి ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారవగా.. ఇక మిగిలిన ఒక బెర్తు కోసం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలో ఉన్నాయి. అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ముంబై ఇండియన్స్‌ చేతిలో ఉంది. ప్రస్తుతం ఏడు విజయాలతో పాయింట్లపట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడిస్తే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా బెంగళూరును వెనక్కినెట్టి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ముంబై గెలిస్తే మాత్రం ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్‌సీబీ అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా కోరుకుంటున్నారు.