IPL Auction: ఐపీఎల్ మెగావేలం (IPL Auction) ఊహించినట్లుగానే హోరాహోరీగా సాగింది. ఈసారి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. రిషబ్ పంత్ 27 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవగా, శ్రేయాస్ అయ్యర్ కూడా 26.75 కోట్లతో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్‌ను 23.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. రసిఖ్ దార్ లాంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని ఆర్సీబీ 6 కోట్లకు కొనుగోలు చేసింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపించలేదు. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సచిన్ వారుసుడిని ఫ్రాంచైజీలు పక్కనపెట్టడంతో ముంబై ఇండియన్స్ అతి కష్టం మీద తమ జట్టులోకి తీసుకుంది. 13 ఏళ్ళ వయసులో వైభవ్ సూర్యవంశీ కోటి రూపాయలకు అమ్ముడుపోగా అర్జున్ 30 లక్షల బేస్ ప్రైజ్ తో ముంబై జట్టులో భాగమయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అర్జున్ పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. సచిన్ వారసుడిగా క్రికెట్ ప్రపంచానికి పరిచయమైన అర్జున్ ఆటకు తక్కువ, ఆటిట్యూడ్ కు ఎక్కువ అన్నట్టుగా ఉంది. గత సీజన్లో స్టోఇనిస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అర్జున్ చూపించిన ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అర్జున్ బౌలింగ్ లో నికోలస్ పురాన్ వరుస సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.అక్కడ కూడా అర్జున్ విమర్శలపాలయ్యాడు.
Also Read: Wayanad : రేపు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్న ప్రియాంక గాంధీ
సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ గా ఉండటం కారణంగానే అర్జున్ ను ముంబై కొనుగోలు చేయాల్సి వస్తుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ గోవా తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతని బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. 4 ఓవర్లలో 48 పరుగులు కోల్పోయినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు.