Site icon HashtagU Telugu

Arjun Tendulkar: తొలి ఓవర్ తోనే అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar

Arjun Tendulkar

Arjun Tendulkar: గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ సీజన్ 16లో అర్జున్ మొదటిసారి ప్రదర్శన చేశాడు. గత కొన్ని సీజన్లుగా ముంబయి ఇండియన్స్ జట్టుతోనే ఉన్నాడు. 2021లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ టెండూల్కర్‌ను బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ ఇప్పటి వరకు ఐపీఎల్ లో తుది జట్టులో స్థానం దక్కలేదు. ప్రస్తుతం అర్జున్ లెఫ్టార్మ్ పేసర్ గా కొనసాగుతున్నాడు. కాగా.. నేడు ఆదివారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగాడు అర్జున్ టెండూల్కర్.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్జున్ గ్రాండ్ ఎంట్రీతో అదరగొట్టాడు. గాయం కారణంగా మ్యాచుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ముంబై తాత్కాలిక కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ రోజు కేకేఆర్ తో జరుగుతన్న మ్యాచ్ లో తొలి ఓవర్‌ను అర్జున్‌తోనే వేయించాడు సూర్యకుమారి యాదవ్. తొలి ఓవర్‌ను అద్భుతంగా వేసిన అర్జున్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కేకేఆర్ ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌.. అర్జున్‌ను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇక అర్జున్ టెండూల్కర్ కి మద్దతుగా సచిన్‌ కుమార్తె, అర్జున్‌ సొదరి సారా టెండూల్కర్‌ సైతం మ్యాచ్‌ చూసేందుకు వచ్చింది.

చాలా కాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న అర్జున్‌ టెండూల్కర్‌కు ఎట్టకేలకు ఛాన్స్‌ రావడంపై సచిన్‌ అభిమానులతో పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.