BCCI: అర్జున్ టెండూల్కర్‌ను ఎన్‌సీఏకు పిలిచిన బీసీసీఐ

భారత క్రికెట్ బోర్డు భవిష్యత్తు క్రికెట్ కోసం యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Arjun Tendulkar

Arjun Tendulkar

BCCI: భారత క్రికెట్ బోర్డు భవిష్యత్తు క్రికెట్ కోసం యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్‌తో సహా మొత్తం 20 మంది యువ ఆటగాళ్లను ఎన్‌సీఏ కోసం బీసీసీఐ పిలిచింది. ఈ క్రీడాకారులు మూడు వారాలకు పైగా కొనసాగే శిక్షణా శిబిరంలో పాల్గొంటారు.

ఎన్‌సిఎలో శిక్షణ శిబిరానికి బిసిసిఐ పిలిచిన 20 మంది ఆటగాళ్లలో అర్జున్ టెండూల్కర్ ఉండటం విశేషం. క్రికెట్ ఆరాధ్య దైవంగా భావించే సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ గత ఐపీఎల్ సీజన్ ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే రెండు మూడు మ్యాచ్ లకే పరిమితమయ్యాడు. ఇక బీసీసీఐ ఆహ్వానించిన వారిలో టీమ్ ఇండియాకు అరంగేట్రం చేసిన చేతన్ సకారియా కూడా ఉన్నాడు. అభిషేక్ శర్మ, మోహిత్ రెడ్కర్, మానవ్ సుతార్, దివిజ్ మెహ్రా, హర్షిత్ రాణా పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఆసియా కప్ కూడా ఈ ఏడాది చివర్లో జరగనుంది. దాని కోసం బీసీసీఐ సమర్థులైన ఆటగాళ్ల కోసం చూస్తుంది. ఈ మేరకు ఆల్ రౌండర్ల క్యాంప్‌ను నిర్వహించాలనుకుంటున్నారు వివిఎస్ లక్ష్మణ్. ఇదిలా ఉండగా జాతీయ సెలక్షన్ కమిటీ తాత్కాలిక అధిపతి శివ సుందర్ దాస్ ఈ ఆటగాళ్లను వారి ప్రదర్శన, సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ శిబిరంలో చాలా మంది ఆల్‌రౌండర్లకు అవకాశం కల్పించారు.

Read More: Electric Bikes: భారత్ లో అతి వేగంగా పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ బైకులు ఇవే.. ధర, ఫీచర్స్ ఇవే?

  Last Updated: 14 Jun 2023, 08:45 PM IST