Site icon HashtagU Telugu

Arjun Tendulkar: కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్.. ప్రస్తుత పరిస్థితి ఇదే?

Arjun Tendulkar

Arjun Tendulkar

దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది క్రికెట్ ప్రేమికులకు సచిన్ టెండుల్కర్ ఫేవరెట్ క్రికెటర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. కాగా ఇటీవలే మొదలైన ఐపీఎల్ 2023 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబయి ఇండియన్స్‌ తరఫున ఈ సీజన్‌లో అరంగేట్రం చేసి అందరి దృష్టి ఆకర్షించాడు అర్జున్‌ తెందూల్కర్‌.

అయితే గత కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టులో లేకపోయినప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే నేడు ప్లేఆఫ్స్‌ రేసులో ముంబయి, లఖ్‌నవూ తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో అర్జున్‌ టెండూల్కర్ తనను కుక్క కరిచిందని వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. స్టేడియంలో లఖ్‌నవూ ఆటగాడు యుధ్‌వీర్‌తో మాట్లాడుతూ. అర్జున్‌ టెండూల్కర్ కుక్క కరిచిన విషయాన్ని తెలిపాడు.

 

ఇందుకు సంబంధించిన వీడియోను ఎల్‌ఎస్‌జీ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఎలా ఉన్నావు అని యుధ్‌వీర్‌ అడగగా తనను కుక్క కరిచిందని అర్జున్‌ ఎడమ చేతిని చూపించాడు. ఎప్పుడు అని అడగ్గా నిన్ననే అని సమాధానమిచ్చాడు. వెంటనే అతను హగ్ చేసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నాడు. కాగా అర్జున్ టెండూల్కర్ ఇక ఈ సీజన్‌ లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అర్జున్ టెండూల్కర్ అభిమానులు కలవరపడుతున్నారు.

Exit mobile version