Argentina vs Mbappe: కైలియన్ ఎంబాపేను ఎద్దేవా చేసేలా అర్జెంటీనా ప్లేయర్స్ చెత్త చేష్టలు.. వీడియో వైరల్!!

అర్జెంటీనా ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. లియోనెల్ మెస్సీ నాయకత్వంలో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా FIFA ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2022 విజేతగా నిలిచింది. 

  • Written By:
  • Publish Date - December 19, 2022 / 03:24 PM IST

అర్జెంటీనా ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. లియోనెల్ మెస్సీ నాయకత్వంలో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా FIFA ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2022 విజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌కు చేరుకున్న ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 4-2తో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అర్జెంటీనా ఆటగాళ్ల సంబరాలు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి. ఆటగాళ్లు చాలా సందడి చేశారు.
అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అర్జెంటీనా జట్టు ఆటగాళ్లంతా ఊగిపోతూ భీకరంగా డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలో ఫ్రాన్స్‌కు చెందిన స్టార్ ఫుట్ బాలర్ కైలియన్ ఎంబాప్పేను డ్రెస్సింగ్ రూమ్‌లో ఎగతాళి చేస్తూ అర్జెంటీనా ఆటగాళ్లు నినాదాలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. గెలుపు ఆనందంలో అర్జెంటీనా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా సైలెన్స్ అయ్యారు.ఒక నిమిషం మౌనం పాటించి.. ఈ మౌనం ఇప్పుడే చనిపోయిన ఎంబాప్పే కోసం అని అర్జెంటీనా ప్లేయర్స్ చెప్పడం వివాదానికి దారి తీసింది.

ఈ వీడియోలో అర్జెంటీనా టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎమిలియానో ​​మార్టినెజ్ , ఇతర క్రీడాకారులు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ కనిపించారు.  ” ఒక నిమిషం మౌనం పాటించండి.. చనిపోయిన Mbappe కోసం!” అని ఎమిలియానో ​​మార్టినెజ్, ఇతర టీమ్ సభ్యులు అనడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్స్ చెయ్యడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని హితవు పలికారు.

 

ఎమిలియానో ​​మార్టినెజ్ ఎవరు?

అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో ఎమిలియానో ​​మార్టినెజ్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ చివర్లో పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్ వ్యూహం విఫలమయ్యేలా అతడు కీలకంగా వ్యవహరించాడు. ఫ్రాన్స్ గోల్స్ చేయకుండా నిరోధించాడు. దీంతో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా జట్టు 4-2తో విజయం సాధించింది.

ఫ్రాన్స్ మెరుపు కిలియన్‌ ఎంబాపే ?

ఫ్రాన్స్‌ తరఫున కిలియన్‌ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. నిర్ణీత సమయంలో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ జట్లు చెరో రెండు గోల్స్‌ చేయడంతో విజేతను నిర్ణయించేందుకు ఎక్స్‌ట్రా టైమ్‌ ఇచ్చారు. అందులోనూ ముందుగా అర్జెంటీనా గోల్‌ కొట్టడంతో.. ఇక మెస్సీ సేన గెలుపు ఖాయమే అనుకున్నారు. అయితే ఎంబాపే అద్భుత రీతిలో గోల్‌ కొట్టి 3-3తో స్కోర్లు సమం చేశాడు. ఆపై పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించగా అర్జెంటీనాను విజయం వరించింది

‘గోల్డెన్ బూట్’ విజేత కిలియన్‌ ఎంబాపే

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ‘గోల్డెన్ బూట్’ అవార్డును ఇస్తారన్న విషయం తెలిసిందే. ప్రతి ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ ఇస్తారు. ఈ సంవత్సరం ఫ్రాన్స్‌ స్టార్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపే ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సిని సైతం వెనక్కి నెట్టి గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఎంబాపే అత్యధికంగా ఎనిమిది గోల్స్‌ బాదాడు. మెస్సి ఏడు గోల్స్‌ చేశాడు.

ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ కథ ఇదీ..

* ఫ్రాన్స్ – కైలియన్ ఎంబాప్పే (గోల్)
* అర్జెంటీనా – మెస్సీ (గోల్)
* ఫ్రాన్స్ – కింగ్స్లీ కోమన్ (మిస్)
* అర్జెంటీనా – పాలో డైబాలా (గోల్)
* ఫ్రాన్స్ – ఆరేలియన్ టి. (మిస్)
* అర్జెంటీనా – లియాండ్రో పరేడెస్ (గోల్)
* ఫ్రాన్స్ – రాండర్ కోలో మువానీ (గోల్)
* అర్జెంటీనా – గొంజలో మోంటియెల్ (గోల్)