Fifa World Cup: ప్రీ క్వార్టర్స్ చేరిన అర్జెంటీనా

ఫిఫా వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది.

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 01:58 PM IST

ఫిఫా వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. పలు సంచలనాలు నమోదవుతున్న వేళ టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ లో అడుగుపెట్టింది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు 2-0 స్కోర్ పోలండ్ పై విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్‌- సీ టాపర్‌గా నాకౌట్‌ బెర్తును ఖరారు చేసుకుంది. పోలండ్, అర్జెంటీనా మ్యాచ్ లో ఫస్టాఫ్ గోల్‌ లేకుండానే ముగిసింది. అయితే, సెకండాఫ్‌లో అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌, జూలియన్‌ అల్వరెజ్‌ గోల్స్‌ సాధించడంతో మెస్సీ టీమ్ విజయం ఖరారైంది. ఇదిలా ఉంటే గ్రూప్‌-సీలోని మరో మ్యాచ్‌లో మెక్సికో సౌదీ అరేబియాను 2-1తో ఓడించింది.

దీంతో 6 పాయింట్లతో అర్జెంటీనా గ్రూప్‌- సీ టాపర్‌గా నిలిచింది. అదే సమయంలో పోలాండ్‌ ఓడినప్పటికీ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో అర్జెంటీనా- ఆస్ట్రేలియాతోనూ , పోలాండ్‌- డిపెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తోనూ తలపడనున్నాయి. ఇదిలా ఉంటే పోలండ్ తో మ్యాచ్ ద్వారా లైనోల్ మెస్సీ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. మెస్సీకి ఇది 999వ మ్యాచ్‌. అంతేకాదు..అలాగే వరల్డ్‌కప్‌ 22వ మ్యాచ్. ఈ క్రమంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా ఉన్న పేరిట రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు.