Rohit Sharma- Virat Kohli: భారత్‌లో ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఉత్సాహం పీక్స్ స్టేజ్‌లో ఉంది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇప్పటి నుంచే ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎలా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit Sharma- Virat Kohli) టెస్ట్ జట్టులో స్థానంపై ప్రశ్నలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనకు వెళతారా అని వెల్లడించారు.
గౌతమ్ గంభీర్ బిగ్ రివీల్
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన చేతుల్లో లేదని, ఎందుకంటే జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ చేస్తుందని అన్నారు. కోచ్‌గా తన పని కేవలం స్క్వాడ్ నుంచి ఉత్తమ ప్లేయింగ్-11ని సిద్ధం చేయడమేనని గంభీర్ తెలిపారు. గంభీర్ ఇలా అన్నారు. కోచ్‌నే జట్టును సిద్ధం చేస్తాడనే ఈ భావనను తొలగించాలి. నా ముందు ఉన్న కోచ్‌లు జట్టు ఎంపిక చేయలేదు. నేనూ అలా చేయడం లేదు. ఈ ప్రశ్నకు నా కంటే సెలక్టర్లు మంచి సమాధానం ఇవ్వగలరని గంభీర్ తెలిపాడు.
Also Read: Surya : పాపం..13 ఏళ్లుగా హిట్ లేని హీరో..ఎక్కడ మిస్ అవుతున్నాడబ్బా !
టీమ్ ఇండియా బ్లూప్రింట్
గౌతమ్ గంభీర్ రాబోయే రెండేళ్లపాటు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా గంభీర్‌ను అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ఆయన సిద్ధం చేసిన బ్లూప్రింట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు స్థానం ఇచ్చారా లేదా? అని ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు గంభీర్ సమాధానిస్తూ.. వాళ్లిద్దరూ తమ ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే విరాట్, రోహిత్ ఖచ్చితంగా టీమ్ ఇండియాలో భాగంగా ఉండాలి. కెరీర్‌ను ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పుడు ముగించాలి అనేది వ్యక్తిగత నిర్ణయం. BCCI, కోచ్ లేదా సెలక్టర్ ఎవరూ మీ కెరీర్ ఎప్పుడు ముగియాలని చెప్పలేరు. ఎవరూ ఆడకూడదని నిషేధించలేదు. ఫిట్‌గా ఉంటే 40 లేదా 45 ఏళ్ల వయసు వరకూ ఆడొచ్చని గంభీర్ పేర్కొన్నాడు.