Anushka Sharma: మళ్లీ గర్భం దాల్చిన అనుష్క శర్మ..? బేబీ బంప్‌తో వీడియో వైరల్..!

బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma), భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Anushka Sharma

Compressjpeg.online 1280x720 Image 11zon

Anushka Sharma: బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma), భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా అనుష్క శర్మ ప్రెగ్నన్సీ గురించి వార్తలు వస్తుండగా ఇప్పుడు విరాట్-అనుష్కల వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో బెంగుళూరులోని ఓ హోటల్‌కి చెందినది. వీడియోలో విరుష్క ఒకరి చేయి మరొకరు పట్టుకుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన అభిమానులు చాలా ఎక్సైట్ అవుతున్నారు.

వైరల్ వీడియోలో ఏముంది..?

క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అందులో బేబీ బంప్ కూడా కనిపిస్తోంది. విరాట్ ఆమెను పట్టుకున్న తీరు, నటి నడుస్తున్న తీరు ఈ విషయాలను ధృవీకరిస్తున్నట్లుగా ఉంది. కొంత కాలం క్రితం అనుష్క ప్రెగ్నన్సీ వార్తలు వినిపించాయని, అయితే ఈ వీడియో దానిని ధృవీకరిస్తున్నట్లుగా ఉందని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో విరాట్, అనుష్కల ఇంట్లో మరోసారి నవ్వులు పూయబోతున్నట్లు స్పష్టమవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: ICC Suspends Sri Lanka: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ..!

2017లో విరాట్-అనుష్క వివాహం

డిసెంబర్ 11, 2017న విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఒకరినొకరు తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకున్నారు. సన్నిహితులు, బంధువుల మధ్య ఇటలీలో ‘విరుష్క’ పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనవరి 11, 2021న అనుష్క కుమార్తె వామికకు జన్మనిచ్చింది. విరాట్- అనుష్క తమ కుమార్తె వామిక గోప్యత గురించి చాలా జాగ్రత్తగా ఉన్నారు. వామిక ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఇంతవరకు షేర్ చేయకపోవటం గమనార్హం. అయితే రెండోసారి ప్రెగ్నెంట్ కి సంబంధించి విరాట్- అనుష్క నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విరాట్- అనుష్క గర్భం దాల్చిన వార్తలు చాలా కాలంగా వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ కప్ 2023లో బిజీగా ఉన్నాడు. అన్ని మ్యాచ్‌లలో బాగా రాణిస్తున్నాడు. అనుష్కశర్మ త్వరలో ఝులన్ గోస్వామి బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  Last Updated: 11 Nov 2023, 08:02 AM IST