ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 24వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. డెవాన్ కాన్వే, ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్ వెల్ ఇన్నింగ్స్ అయినా, తొలి ఓవర్ లోనే విరాట్ కోహ్లి వికెట్ పతనం అయినా.. చిన్నస్వామి స్టేడియంలో కూర్చున్న చెన్నై, బెంగళూరు అభిమానులకు ఒక్క క్షణం కూడా బోర్ అనిపించలేదు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మైదానంలోకి దిగడంతో స్టేడియం మొత్తం ఉత్కంఠగా మారింది. చెన్నై ఇన్నింగ్స్ 20వ ఓవర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ వేసిన నాలుగో బంతికి రవీంద్ర జడేజా అవుట్ కాగా.. కెప్టెన్ కూల్ మైదానంలోకి వచ్చాడు.
https://twitter.com/cricket_country/status/1648033704277852160?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1648033704277852160%7Ctwgr%5E88ca7af64a653d6f7b76f3fe952926fe4d9380a0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.lokmatnews.in%2Fcricket%2Fnews%2Fipl-2023-dhoni-came-out-to-bat-fans-got-excited-anushka-sharma-gave-such-a-reaction-video-viral-b668%2F
కెప్టెన్ కూల్ ఇన్నింగ్స్‌లో దిగగానే చిన్నస్వామి మైదానం పూర్తిగా చెపాక్‌గా మారడంతో ధోనీ.. ధోనీల అని ఫ్యాన్స్ కేకలు వేయడం ప్రారంభించారు. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా ధోనీకి ఈ అద్భుతమైన స్వాగతాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఈ సందర్భంగా తాము కూడా ధోనీ ఫ్యాన్స్ అని చెప్పడం విశేషం. తాను మాత్రమే కాదు కోహ్లీ కూడా ధోనీని ప్రేమిస్తాడు అంటూ అనుష్క శర్మ చెప్పిన మాటలు అభిమానులను అలరిస్తున్నాయి.
Also Read: SRH vs MI: హైదరాబాద్ వేదికగా నేడు మరో రసవత్తర మ్యాచ్.. జోరు మీదున్న ముంబై, హైదరాబాద్..!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. CSK తరపున కాన్వాయ్ 83, శివమ్ దూబే 52 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో RCBని ఓడించింది.