కింగ్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కోహ్లీ ఫామ్ లోకి వస్తే ఎలాంటి రికార్డునైనా దాసోహం కావాల్సిందే. ఇవాళ సౌత్ ఆఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లో మరో రికార్డు కోహ్లీని ఊరిస్తోంది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కోహ్లీ మొత్తం 989 పరుగులు చేశాడు. ఇంకో 28 పరుగులు చేస్తే ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. శ్రీలంక మాజీ ఆటగాడు మహేలా జయవర్దనే 1016 పరుగులతో ఈ జాబితాలో ముందున్నాడు.
మరో 11 పరుగులు చేస్తే .. జయవర్దనే తర్వాత వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. విరాట్.. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు ఆడి.. 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధ శతకాలున్నాయి. టి20 ప్రపంచకప్ లో గ్రూప్–2లో భాగంగా నేడు జరిగే మూడో ‘సూపర్ 12’ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం నాలుగున్నరకు ఆస్ట్రేలియా లోని పెర్త్ స్టేడియం లో జరుగుతుంది.