క్రికెట్ లవర్స్ (Cricket Lovers) కు హెచ్సీఏ (HCA) గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? హైదరాబాద్ (Hyderabad) లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (International Cricket Stadium ) ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుందా..? అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం ఉప్పల్ (Uppal) లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium) ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టేడియం ఇండియా టీం కే కాదు ఇండియన్ క్రికెట్ లవర్స్ కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే టీమిండియా ఆడే మ్యాచులతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచుకు ఎక్కువగా ఈ స్టేడియం లో జరుగుతాయి. అలాగే ఈ స్టేడియం లో అడిగిన మ్యాచ్ లు ఎక్కువగా టీం ఇండియా విజయం సాదిస్తుంటుంది. దీంతో ఈ స్టేడియం అంటే క్రికెట్ అభిమానులకు పిచ్చి. కాకపోతే ఈ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ (38 వేలు) మాత్రమే. దీంతో IPL మ్యాచ్ టైం లో అభిమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో హైదరాబాద్లో నూతన స్టేడియం నిర్మించాలని హెచ్సీఏ భావిస్తుంది. దీనికి గాను నగర శివార్లలో 100 ఎకరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో స్టేడియాన్ని కట్టాలని డిసైడ్ అయ్యారు. లక్ష సీటింగ్ కెపాసిటీతో అధునాతన సౌకర్యాలతో నూతన స్టేడియాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయాన్ని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు (Jagan Mohan Rao) తెలిపారు. ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాల్లో మినీ స్టేడియాలను కూడా నిర్మించనున్నామని తెలిపి క్రికెట్ అభిమానుల్లో సంతోషం నింపారు.
We’re now on WhatsApp. Click to Join.
కొత్త స్టేడియంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జగన్ మోహన్ రావు తెలిపారు. స్టేడియాల నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలుత భూముల సేకరణ చేపడతామన్నారు. భూముల సేకరణ పూర్తయితే బీసీసీఐ నుంచి నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు. భూములను సర్కారు నుంచి లీజుకు తీసుకోకుండా హెచ్సీఏ తరఫున కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గవర్నమెంట్ నుంచి భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు రావన్నారు. ఈ విషయం మీద క్రీడా మంత్రిత్వ శాఖతో జిల్లా కలెక్టర్లు, అధికారులను సంప్రదించామన్నారు. మరి ఈ స్టేడియం లు ఎప్పుడు..ఎక్కడెక్కడ నిర్మిస్తారో చూడాలి.
Read Also : Congres vs BRS : తాము దింపిన బుల్లెట్ కేసీఆర్ కు బలంగా దిగింది – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి