Site icon HashtagU Telugu

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు హ్యాండిచ్చిన బ్రిటిష్ సింగ‌ర్ జాస్మిన్ వాలియా?!

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ గత సంవత్సరం 2024లో విడిపోయిన విష‌యం తెలిసిందే. కొంత కాలం తర్వాత సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్‌ చేస్తున్నాడని వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్దరి డేటింగ్ వార్త‌లు చాలా సంచలనం సృష్టించాయి. కానీ హార్దిక్, జాస్మిన్ ఇద్దరూ ఈ వార్త‌ల‌పై స్పందించలేదు. ఇప్పుడు గాసిప్ వర్గాల్లో వీరి సంబంధం ధృవీకరించబడకముందే విడిపోయార‌నే చర్చలు జరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. హార్దిక్ పాండ్యా- జాస్మిన్ వాలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

బ్రేకప్ చర్చ?!

రెడ్డిట్‌లో ఒక పోస్ట్‌లో క్రికెటర్ హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నార‌ని పేర్కొన్నారు. హార్దిక్, జాస్మిన్ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారా? ఏం జరుగుతోంది? అని రెడ్డిట్ ఓ నివేదిక‌లో పేర్కొంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా బ్రేకప్ చర్చలు మొదలయ్యాయి. అయితే, వీరిద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు.

Also Read: Shamshabad Airport : ప్రయాణికులకు చెమటలు పట్టించిన ఎయిరిండియా ఫ్లైట్

నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా.. జాస్మిన్ వాలియా పేరు బాగా వైర‌ల్ అయింది. నిజానికి, వీరిద్దరి గ్రీస్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు డేటింగ్‌ చేస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత క్రికెట్ మైదానంలో జాస్మిన్ హార్దిక్ పాండ్యాను చీర్ చేస్తూ చాలాసార్లు కనిపించింది. చాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కూడా జాస్మిన్ వాలియా హాజరైంది. దీని తర్వాత వీరి డేటింగ్ వార్త‌లు మరింత ఊపందుకున్నాయి.

హార్దిక్ పాండ్యా అభిమానులు అతను జాస్మిన్ వాలియాతో తన సంబంధాన్ని ధృవీకరిస్తాడని ఎదురుచూస్తున్నారు. అయితే, అది జరగకముందే వీరి బ్రేకప్ చర్చలు మొదలయ్యాయి. జాస్మిన్ గురించి చెప్పాలంటే.. ఆమె ఒక బ్రిటిష్ సింగర్, విజయవంతమైన మోడల్. ‘ది ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్’ (TOWIE) షో ద్వారా ఆమె ప్రజాదరణ పొందింది.