Site icon HashtagU Telugu

Angry Rishabh Pant: టీమిండియా- ఇంగ్లాండ్ టెస్ట్‌.. అంపైర్‌పై రిష‌బ్ పంత్ ఫైర్‌!

Angry Rishabh Pant

Angry Rishabh Pant

Angry Rishabh Pant: హెడింగ్లీలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఇంగ్లాండ్ జట్టు, మరికొన్నిసార్లు టీమ్ ఇండియా మ్యాచ్‌లో ముందంజలో కనిపిస్తోంది. మ్యాచ్ మూడవ రోజు మొదటి సెషన్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంపైర్ క్రిస్ గఫానీకి ఒక డిమాండ్ చేశారు. కానీ అతను దానిని తిరస్కరించాడు. ఆ తర్వాత లైవ్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ కోపంతో (Angry Rishabh Pant) కనిపించాడు.

రిషభ్ పంత్‌కు అంపైర్‌పై కోపం ఎందుకు వచ్చింది?

హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్‌లో ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు వేగంగా పరుగులు చేస్తోంది. హ్యారీ బ్రూక్ ప్రతి భారత బౌలర్‌పై దూకుడుగా ఆడాడు. అదే సమయంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వెనుకబడలేదు. ఆ సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, కెప్టెన్ గిల్ అంపైర్ క్రిస్ గఫానీని పాడైన బంతిని మార్చమని కోరారు. గఫానీ భావన ప్రకారం.. బంతి ఇంకా అంతగా పాడవలేదని, అది మార్చాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చాడు. దీంతో రిషభ్ పంత్‌కు కోపం వచ్చి, అంపైర్ ముందే బంతిని విసిరేశాడు. దీనిని చూసిన ప్రేక్షకులు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే, ఆ తర్వాత పంత్ తన కోపాన్ని శాంతపరచుకున్నాడు.

Also Read: Suparipalanalo Toliadgugu: సుపరిపాలనలో తొలి అడుగు.. ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం!

వార్త రాసే సమయానికి ఇంగ్లిష్ జట్టు 465 ప‌రుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో హ్యారీ బ్రూక్ 99 పరుగులు, జామీ స్మిత్ 40 ప‌రుగులు చేశారు. మూడవ రోజు ఆటలో ప్రసిద్ధ్ కృష్ణ 106 పరుగులు చేసిన ఓలీ పోప్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ వ్య‌క్తిగ‌త‌ 20 పరుగుల వద్ద బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. టీమిండియా బౌలింగ్‌లో బుమ్రా 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు తీశారు.