Andrew Flintoff: కారు ప్రమాదంలో మాజీ క్రికెటర్ కు గాయాలు

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (Andrew Flintoff) కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌ లోని సర్రేలో బీబీసీ సిరీస్‌ 'టాప్ గేర్' కోసం ఎపిసోడ్‌ షూట్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ (Andrew Flintoff)కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

  • Written By:
  • Publish Date - December 14, 2022 / 10:05 AM IST

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (Andrew Flintoff) కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌ లోని సర్రేలో బీబీసీ సిరీస్‌ ‘టాప్ గేర్’ కోసం ఎపిసోడ్‌ షూట్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ (Andrew Flintoff)కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతని గాయాలు ప్రాణాంతకం కాదని అధికారులు తెలిపారు.

సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్‌ లో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్లింటాఫ్ ట్రాక్‌లో మామూలుగా డ్రైవింగ్ చేస్తున్నాడని, అధిక వేగంతో వెళ్లలేదని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఫ్లింటాఫ్ గాయపడడంతో షూటింగ్ ను ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే 45 ఏళ్ల మాజీ ఆల్‌రౌండర్‌కు ఎటువంటి తీవ్రమైన గాయం కాలేదు. గతంలో ఆస్ట్రేలియన్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కు జరిగిన సంఘటనకు సంబంధించి BBC ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటన ఇలా ఉంది. ఆండ్రూ ఫ్లింటాఫ్ ఈ ఉదయం టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. సిబ్బంది వైద్య బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మేము రాబోయే సమయంలో మరిన్ని వివరాలను తెలియజేస్తామని పేర్కొంది. ఆండ్రూ ఫ్లింటాఫ్ 2019లో షో సహ ప్రెజెంటర్ అయ్యారు.

Also Read: IND vs BAN: నేటి నుంచి బంగ్లా-భారత్ తొలి టెస్ట్ మ్యాచ్.. కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!

ఆండ్రూ ఫ్లింటాఫ్ 1998- 2009 మధ్య ఇంగ్లండ్ తరపున 79 టెస్టులు, 141 ODIలు, 7 T20లు ఆడాడు. ఈ సమయంలో అతను జట్టుకు నాయకత్వం వహించాడు. టెస్టు క్రికెట్‌లో 3845 పరుగులు చేసి 226 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3394 పరుగులు చేసి 169 వికెట్లు తీశాడు. టీ20ల్లో 76 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు. 2005 యాషెస్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.