Site icon HashtagU Telugu

Andre Russell: ర‌ఫ్ఫాడించిన రస్సెల్.. కోల్ కతా నైట్ రైడర్స్ భారీస్కోర్..!

Andre Russell

Andre Russell

Andre Russell: ఐపీఎల్ 17వ సీజన్ రెండోరోజే అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ దక్కింది. ఎలాంటి విధ్వంసం అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు కోల్ కతా ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andre Russell)…ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రస్సెల్ సిక్సర్ల సునామీనే సృష్టించాడు. సన్ రైజర్స్ బౌలర్లను భయపెడుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. నిజానికి కోల్ కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబాటుకు గురైంది. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో రాణించినా పవర్ ప్లేలోనూ మూడు వికెట్లు కోల్పోయింది. 70 పరుగుల లోపే 5 వికెట్లు చేజార్చుకుంది. కనీసం 150 స్కోరైనా చేస్తుందనుకున్న దశలో రమణ్ దీప్ సింగ్ అదరగొట్టాడు. కేవలం 17 బంతుల్లో 35 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఔట్ చేసిన తర్వాత సన్ రైజర్స్ బౌలర్లు ఖచ్చితంగా బాధపడి ఉంటారు. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన రస్సెల్ , రింకూ సింగ్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలర్లను ఎడాపెడా బాదేశాడు.

Also Read: SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ లో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం, 7 సిక్స్‌లతో వీర విహారం

తనకు మాత్రమే సాధ్యమైన పవర్ హిట్టింగ్ తో ఫ్యాన్స్ కు వీకెండ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. రస్సెల్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా దూకుడుగా ఆడి స్కోరును 200 దాటించాడు. చివరికి కోల్ కతా నైట్ రైడర్స్ 208 పరుగులు చేసింది. రస్సెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 64 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. రింకూ సింగ్ 23 పరుగులు చేయగా.. సన్ రైజర్స్ బౌలర్లు నటరాజన్ , కమ్మిన్స్ తప్పిస్తే మిగిలిన వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

We’re now on WhatsApp : Click to Join